India Corona : కరోనా బులిటెన్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- kunduru Vinod
- Published On : October 16, 2021 / 11:12 AM IST
Corona
India Corona : దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా బారినపడి 166 మంది ప్రాణాలు విడిచారు. ఇక తాజాగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,53,573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,51,980కి చేరింది.
చదవండి : టీకా మస్ట్.. లేదంటే ఉద్యోగం ఫట్
ఇక ఇప్పటి వరకు 3,33,99,961 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. కేరళలో నిన్న ఒక్కరోజే కొత్తగా 8,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. గత 24 గంటల్లో 8,36,118 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 97,23,77,045 మందికి వ్యాక్సిన్ వేశారు. రెండు మూడు రోజుల్లో వ్యాక్సినేషన్ 100 కోట్లకు చేరనుంది.
చదవండి : దేశంలో కరోనా తగ్గినట్లేనా? 27 రాష్ట్రాల్లో తగ్గుముఖం.. కేరళలో మాత్రం
