Corona Vaccine : టీకా మస్ట్.. లేదంటే ఉద్యోగం ఫట్

డిసెంబర్ 1 నాటికి కరోనా టీకా తీసుకోవాలని.. లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని సూచించారు విద్యాశాఖామంత్రి క్రిస్ హిస్కిన్స్.

Corona Vaccine : టీకా మస్ట్.. లేదంటే ఉద్యోగం ఫట్

Corona Vaccine

Corona Vaccine : కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ సమర్థవంతంగా ఎదురుకుంది. కేసులు సింగిల్ డిజిట్ లో ఉన్నప్పుడే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు ప్రధాని జసిందా అర్డర్న్. కరోనా కట్టడి విషయంలో జసిందా అర్డర్న్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇక కేసుల సంఖ్య పెరుగుతుందని గుర్తించి వెంటనే అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. తమ దేశ ప్రజల రక్షణ కోసం ఇతర దేశాలకంటే ఉండే విదేశీ విమానాలను నిలిపివేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఇక తాజాగా ఆ దేశ ప్రధాని మరో సంచనల నిర్ణయం తీసుకున్నారు.

Read More : Corona : కేసులు తగ్గాయి.. అయినా జాగ్రత్తగా ఉండండి.. అసలే పండుగ సీజన్

టీకా తీసుకోకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని హెల్త్ కేర్ వర్కర్లకు, ఉపాధ్యాయులకు తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఈ మేరకు అక్కడి విద్యాశాఖామంత్రి క్రిస్ హిస్కిన్స్ మాట్లాడుతూ.. కరోనా నివారణకు టీకా ఒక్కటే మార్గమని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. డిసెంబర్ 1 వరకు హెల్త్ కేర్ వర్కర్లు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. బోధన సిబ్బందితోపాటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకా తీసుకోవాలని వివరించారు.

Read More : Corona : ఇప్పటి వరకు కరోనా సోకనివారు జాగ్రత్త : టీ. ఆరోగ్య శాఖ