Tomato Ice Cream : టమాటా ఐస్ క్రీం.. ఇండియాలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఐస్ క్రీం అట..
ఫుడ్ లవర్స్ కోసం రకరకాలా ఫుడ్ కాంబినేషన్లు వస్తున్నాయి. టమాటా ఐస్ క్రీం వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇండియాలో ప్రస్తుతం ఇది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఐస్ క్రీం అంటూ నెటిజన్లు పెదవి విరిచారు.
- Lakshmi 10tv
- Updated on- August 9, 2023 / 12:40 PM IST
Tomato Ice Cream
Tomato Ice Cream : పలు రెస్టారెంట్ యజమానులు, వీధి వ్యాపారులు రకరకాల వంటకాల్ని పరిచయం చేస్తున్నారు. వీటిలో కొన్ని విచిత్రంగా, విపరీతంగా ఉంటున్నాయి. తాజాగా ఇంటర్నెట్ లో ఒక వ్యక్తి టమాటా ఐస్ క్రీం తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు టమాటాను మర్చిపోయి చాలా రోజులు అవుతోంది. టమాటా కొనుగోలు చేసినా చాలా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి. ఆగస్టు నెలాఖరుకి ఈ రేట్లు మరింత పెగవచ్చనే ప్రకటనలతో వినియోగదారులు ఠారెత్తిపోతున్నారు. ఓవైపు టమాటా దొంగతనాలు పెరిగిపోవడంతో రైతులు తమ పొలాలకు రక్షణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. పిల్లల పుట్టినరోజు సందర్భాల్లో టమాటాలు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. టమాటాలపై రీల్స్, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వీటి మధ్యలో కొత్త వీడియో వచ్చింది. టమాటా ఐస్ క్రీం తయారు చేస్తున్న ఓ వ్యక్తి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Ice Cream Seller Tricks : ఐస్ క్రీం అమ్మేవాడి ట్రిక్స్‌కి బిక్కమొహం వేసిన చిన్నారి..వీడియో వైరల్
@aapkabhai_foody అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన టమాటా ఐస్ క్రీం వీడియో చూసి నెటిజన్లు షాకయ్యారు. ఈ కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ప్రస్తుతం ఇండియాలో చాలా ఎక్స్‌పెన్సివ్ ఐస్ క్రీం ఇదే అంటూ కామెంట్ చేశారు. చాలామంది ఈ కాంబినేషన్‌ను విమర్శించారు.
