Child viral video : కారు హారన్‌కి భయపడిన చిన్నారి ఐస్ క్రీం కింద పడేసుకుంది.. కారు డ్రైవర్‌ని తిట్టిపోసిన నెటిజన్లు

ఐస్ క్రీం ఇష్టపడని చిన్న పిల్లలు ఉంటారా? ఇక అది తింటున్నప్పుడు ఎవరు ఎంత డిస్ట్రబ్ చేసినా పట్టించుకోరు. రోడ్డుపై వెళ్తున్న ఓ చిన్నారి ఎంతో కాన్సన్‌ట్రేషన్ గా ఐస్ క్రీం తింటోంది. సడెన్‌గా మోగిన కారు హారన్‌కి భయపడిపోయింది. చేతిలో ఐస్ క్రీం జారిపడింది. ఇక కారు హారన్ మోగించిన వ్యక్తిని నెటిజన్లు తిట్టిపోశారు.

Child viral video : కారు హారన్‌కి భయపడిన చిన్నారి ఐస్ క్రీం కింద పడేసుకుంది.. కారు డ్రైవర్‌ని తిట్టిపోసిన నెటిజన్లు

Child viral video

Updated On : May 14, 2023 / 1:08 PM IST

Viral News : ఒక్కోసారి చిన్న చిన్న శబ్దాలకి హడలిపోతాం. అందుకు కారణం మనం ఇతర అంశాలు ఏవో ఆలోచిస్తూ ఉండటం కావచ్చు. రోడ్డు మీద ఐస్ క్రీం తింటూ వస్తున్న ఓ చిన్నారి కారు హార్న్‌కి ఎంత భయపడిందో చూడండి.

PM Narendra Modi : ప్రధాని మోడీ షేర్ చేసిన శాల్మలీ వీడియో.. చిన్నారి ప్రతిభకు ప్రధాని ఫిదా..

స్కూల్ బ్యాగ్ ధరించి.. ఐస్ క్రీం తింటూ రోడ్డుపై సంతోషంగా వెళ్తోంది ఓ చిన్నారి. ఎదురుగా కారులో వస్తున్న వ్యక్తి ఒక్కసారిగా హారన్ మోగించాడు. అంతే.. బెదిరిపోయిన ఆ పిల్ల ఐస్ క్రీం కింద జారవిడుచుకుంది. ఆ సమయంలో ఆమె ఇచ్చిన రియాక్షన్‌కి జనం జాలి పడ్డారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని తిట్టిపోశారు. cow_99857 అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Boy with placard : మీ కూతురితో డేటింగ్‌కి పర్మిషన్ ఇవ్వండంటూ కోహ్లీకి చిన్నారి అభ్యర్ధన .. పేరెంట్స్‌ని తప్పు పడుతున్న జనం

హారన్ కొట్టిన వ్యక్తికి బుద్ధి లేదని.. ఆ చిన్నారి రియాక్షన్ చూస్తే చాలా బాధ అనిపించిందని కొందరు కామెంట్లు పెట్టారు. తిరిగి ఐస్ క్రీం కొనిచ్చావా? లేదా? అని మరికొందరు ప్రశ్నించారు. ఎంతో ఆనందంగా, ఆస్వాదిస్తూ ఐస్ క్రీం తింటూ వెళ్తున్న చిన్నారి పట్ల కారులో ఉన్న వ్యక్తి చేసిన పనికి తిట్లు తినాల్సి వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by 吃我拳頭 (@cow_99857)