Boy with placard : మీ కూతురితో డేటింగ్‌కి పర్మిషన్ ఇవ్వండంటూ కోహ్లీకి చిన్నారి అభ్యర్ధన .. పేరెంట్స్‌ని తప్పు పడుతున్న జనం

ఊహ తెలియని పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని కొందరు పేరెంట్స్ తాము వైరల్ అయిపోవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. రీసెంట్‌గా ఓ చిన్నారి పేరెంట్స్ చేసిన పనిని సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు.

Boy with placard :  మీ కూతురితో డేటింగ్‌కి పర్మిషన్ ఇవ్వండంటూ కోహ్లీకి చిన్నారి అభ్యర్ధన .. పేరెంట్స్‌ని తప్పు పడుతున్న జనం

Boy with placard

Boy with placard :  పిల్లలకి మంచి బుద్ధులు నేర్పాల్సిన తల్లిదండ్రులు పిచ్చి పనులు చేస్తే జనం ఊరుకోరు. తమకి గుర్తింపు రావడం కోసం ఓ చిన్నారి పేరెంట్స్ చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

NTR – Pranathi : చార్మినార్‌ వద్ద ఎన్టీఆర్‌ భార్య ప్రణతి షాపింగ్‌.. ఫోటో వైరల్‌!

బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓ బుడతడు పట్టుకున్న ప్లకార్డు చూసి జనం అవాక్కయ్యారు. ‘ విరాట్ అంకుల్ .. మీ కూతురు వామికతో (Vamika) డేటింగ్ చేయడానికి అనుమతి కావాలని’ ఆ ప్లకార్డులో అభ్యర్ధించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli,), నటి అనుష్క శర్మ(Anushka Sharma ) దంపతులకు వామిక అనే కూతురు ఉందని అందరికీ తెలుసు. ఆమెతో డేటింగ్ కి వెళ్లేందుకు విరాట్ పర్మిషన్ అడుగుతూ చిన్నారి చేసిన అభ్యర్ధనను జనం తప్పు పడుతున్నారు. ఈ ఫోటోని డాక్టర్ నిమో యాదవ్ అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

strange creature : అమరిల్లో సిటీలో వింత ఆకారం.. అంతుచిక్కని మిస్టరీ..

ఇక ఈ ఫోటో చూసి చాలామంది నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రుల్ని తప్పు పట్టారు. మీరు మీ బిడ్డను తప్పు దోవ పట్టిస్తున్నారని హితవు పలికారు. అసలు ఆ ప్లకార్డులో రాసినది ఏమిటో కూడా ఆ చిన్నారికి తెలియదని.. అతని పేరెంట్స్ కి బుద్ధి లేదని జనం మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో పిల్లల్ని అడ్డుపెట్టుకుని తాము వైరల్ అవ్వాలనుకునే పేరెంట్స్ ఎక్కువ అయ్యారని ముఖ్యంగా రియాల్టీ షోలలో ఈ హవా ఎక్కువైందని అంటున్నారు. వైరల్ అవ్వాలనే భ్రమలో ఇలాంటి పనులు చేస్తే పొడిగే నోళ్లతో తిట్లు తినాల్సి వస్తుందని ఆ పేరెంట్స్ కి అర్ధమైందో లేదో మరి.