×
Ad

Road Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టూరిస్టు బస్సు, 8 మంది మృతి

ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్టు బస్సులో 54 మంది ఉన్నారు.

  • Published On : September 30, 2023 / 11:58 PM IST

Tamil Nadu Road Accident (1)

Tamil Nadu Road Accident : తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూరు-మేటుపాళ్యం దగ్గర లోయలో పడిపోయింది. నీలగిరి జిల్లా కూనూరు-మేటుపాళ్యం జాతీయ రహదారి పక్కనే ఉన్న 50 అడుగుల లోతున్న లోయలో బస్సు పడింది. దీంతో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఊటికి వెళ్లి తెన్ కాశికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్టు బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు.

Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

ఘటనాస్థంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొంతమందిని రక్షించి చికిత్స కోసం కూనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.