CM Offer to Vijay: TVK నేత సంచలన ప్రకటన.. ‘ఆ పార్టీ విజయ్‌కి CM పదవి, 50 శాతం సీట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది’

CM Offer to Vijay : తమతో పొత్తు పెట్టుకుంటే.. టీవీకే అధ్యక్షుడికి సీఎం పదవి ఇవ్వడమే కాక.. సగం సీట్లు ఇచ్చేందుకు సిద్ధమంటూ ఓ పార్టీ ఆఫర్ ఇచ్చిందని టీవీకే నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

TVK leader aadhav arjuna said they Reject Unidentified Parties 90 Seats cm post to Vijay Offer

CM Offer to Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాన పార్టీలన్నీ.. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీతో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో టీవీకే నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ రాజకీయ పార్టీ టీవీకేతో పొత్తు కోసం కీలక ప్రతిపాదన చేసిందని.. తమ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు అంగీకరించిందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

టీవీకే నాయకుడు ఆదవ్ అర్జున్ మాట్లాడుతూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవడానికి ఒక రాజకీయ పార్టీ చాలా ఆసక్తి చూపుతోందని, ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. మా టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రి పదవితో సమాన సీట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే ఆ పార్టీ పేరు వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. పైగా “ముఖ్యమంత్రి పదవి కోసం విజయ్ ఢిల్లీకి తలవంచే వ్యక్తి కాదు” అంటూ వ్యాఖ్యానించడంతో.. టీవీకేతో పొత్తుకు ఆసక్తి చూపుతోంది బీజేపీ అయి ఉండొచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

“ముఖ్యమంత్రి పదవి కోసం మా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి తలవంచే వ్యక్తి కాదు. ఆ పార్టీ వారు మాకు 50-90 సీట్ల వరకు వివిధ ఆఫర్లు ఇచ్చారు. కానీ విజయ్ మాత్రం పదవి కాదు, ప్రజల విశ్వాసమే కావాలని తేల్చి చెప్పి.. ఆ పార్టీ ఆఫర్‌ను అంగీకరించలేదు” అన్నారు.

ఇదిలా ఉంటే ఎన్డీఏ.. టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు.. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి మరియు 55 సీట్లు ఆఫర్ చేసినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ ప్రతిపాదనపై ఎన్డీయేలోని అన్ని పార్టీలు సంతృప్తిగా లేవని తెలుస్తోంది. విజయ్ కూడా తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీని తన ‘సిద్ధాంత శత్రువు’గా కూడా పేర్కొన్నారు.