DMK Lok Sabha Speaker Letter : TVKకు కాంగ్రెస్ మద్దతు.. సంచలన నిర్ణయం తీసుకున్న డీఎంకే.. లోక్ సభ స్పీకర్ కు లేఖ

DMK Lok Sabha Speaker Letter : తమిళనాట.. కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ప్రకటించడంతో.. డీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

TVK Vijay Congress Alliance DMK Letter to Lok Sabha Speaker Tamil Nadu

DMK Lok Sabha Speaker Letter : తమిళనాట కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు లభించింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ 118 సీట్లు సంపాదించుకున్నారు. ఇందుకోసం విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు మద్దతిచ్చాయి. ఈ క్రమంలో విజయ్ శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఆ తర్వాత తనకు మద్దతిచ్చే పార్టీలతో కలిసి విజయ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడంతో.. డీఎంకే (DMK) పార్టీ తీవ్ర అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో డీఎంకే, హస్తం పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో తాము కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చోబోమని.. తమ సీటింగ్ ఏర్పాట్లలో మార్పులు చేయాలంటూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీతో మా కూటమి బంధం ముగిసినందున ఈ మార్పులు చేయాలని కనిమొళి ఈ లేఖలో కోరారు.

తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే (TVK) పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి. పూర్తి మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతుతో విజయ్ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • టీవీకే – 107
  • కాంగ్రెస్ – 5
  • వీసీకే – 2
  • సీపీఐ – 2
  • సీపీఎం – 2
  • మొత్తం 118