Vijay TVK Government : బ్రేకింగ్ న్యూస్.. తొలగిన అడ్డంకులు.. విజయ్ కి ఫుల్ మెజారిటీ.. సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
Vijay TVK Government : విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. మెజారిటీ 118 సీట్లను సంపాదించారు.
vijay tvk to form government in tamil nadu with congress vck cpi cpm support
Vijay TVK Government : తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ పరిస్థితులకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 118 అసెంబ్లీ స్థానాలను సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ సొంతంగా 108 స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పూర్తి మెజారిటీ నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో అప్పట్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడీ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన పూర్తి మెజారిటీని ఆయన సాధించారు. విజయ్‌కు సీపీఎం (CPM), సీపీఐ (CPI), మరియు వీసీకే (VCK) పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఆయన బలం పెరిగింది. దీంతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి రంగం సిద్ధమైంది.
- టీవీకే – 107
- కాంగ్రెస్ – 5
- వీసీకే – 2
- సీపీఐ – 2
- సీపీఎం – 2
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు విజయ్.. గవర్నర్‌ను కలవనున్నారు. మద్దతు సంతకాలు సమర్పించిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. టీవీకే (TVK), కాంగ్రెస్, వీసీకే (VCK), మరియు వామపక్షాల ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. విజయ్‌కు మద్దతు కూడగట్టడం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజాతో ఫోన్లో మాట్లాడారు. అలాగే వీసీకే అధినేతకు సైతం ఖర్గే కాల్ చేశారు. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో విజయ్ మూడోసారి శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై క్లారిటీ రానుంది.
