Anna Lezhneva : అన్నా లెజినోవా ఆస్తుల విలువ 1800 కోట్లా?
Anna Lezhneva : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు.
Anna Lezhneva net worth education qualifications Career
Anna Lezhneva : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అలాగే తమ పిల్లల సంతోషం, భవిష్యత్తు, సంక్షేమమే తమకు ఎప్పటికీ ముఖ్యమని తెలిపారు.
అన్నా లెజినోవా ఎవరు?
అన్నా లెజినోవా రష్యాకు చెందినవారు. ఆమె 1980లో జన్మించారు. ఆమె ఓ మోడల్‌గా, నటిగా గుర్తింపు పొందారు. 2011లో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘తీన్ మార్’ షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో అన్నా ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2013 సెప్టెంబర్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు.
సింగపూర్‌లో ఉన్నత విద్య.. హోటల్ వ్యాపారం!
ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం.. అన్నా లెజినోవా 2024లో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలోనూ ఆమెకు మంచి గుర్తింపు, సింగపూర్‌లో కొన్ని హోటళ్లను కలిగి ఉన్నారు. రష్యా, సింగపూర్లలో ఆమెకు సుమారు రూ.1,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
