Top 5 Most Expensive Divorces : ప్రపంచంలోనే టాప్ 5 కాస్ట్లీ విడాకులు.. బిల్ గేట్స్ నుంచి జెఫ్ బెజోస్ వరకు కళ్లు చెదిరే సెటిల్మెంట్లు..!
Top 5 Most Expensive Divorces : ప్రపంచంలో బిలియనీర్ల విడాకులు అంటే కేవలం భార్యాభర్తలు విడిపోవడం మాత్రమే కాదు.. వేల కోట్ల రూపాయల ఆస్తుల పంపకం కూడా.. ప్రపంచ కుబేరులైన జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల విడాకులు అప్పట్లో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి.
Top 5 Most Expensive Divorces
- విడాకులంటే మాటలు కాదు.. వేల కోట్లలో సెటిల్మెంట్లు
- పెళ్లికి ఫుల్స్టాప్.. ఆస్తుల్లో మాత్రం భారీ వాటా
- విడిపోయినా తగ్గని సంపద.. విడాకుల కోసం వేల కోట్లు
- రిలేషన్‌కు బ్రేకప్.. ఆస్తుల పంపకంలో బిలియన్ల లెక్కలు
Top 5 Most Expensive Divorces : సాధారణంగా భార్యాభర్తలు విడిపోతే ఆస్తుల పంపకం, భరణం వంటి విషయాలు చర్చకు వస్తుంటాయి. కానీ, ప్రపంచ కుబేరుల విషయంలో మాత్రం ఈ లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. వైవాహిక బంధానికి బ్రేకప్ చెప్పిన తర్వాత ఆస్తుల పంపకం కోసం వేల కోట్లు చేతులు మారిన సందర్భాలున్నాయి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా వార్తల్లో నిలిచిన 5 జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. బిల్ గేట్స్ – మిలిండా గేట్స్ (2021):
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మిలిండా గేట్స్ దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వీరి విడాకుల సెటిల్మెంట్ కింద సుమారు రూ.7 లక్షల కోట్లు భరణం అందుకున్నట్టు ఆస్తుల అంచనా..
2. బిల్ గ్రాస్ – సూ గ్రాస్ (2017) :
ప్రముఖ ఇన్వెస్టర్ బిల్ గ్రాస్, సూ గ్రాస్ విడాకుల సెటిల్మెంట్ విలువ సుమారు సుమారు రూ.12,139 కోట్లుగా అంచనా..
Read Also : Cyberabad Work From Park : ఇక కేఫ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు.. పార్కులో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు..!
3. అలెక్ వైల్డెన్స్టీన్ – జోస్లిన్ వైల్డెన్స్టీన్ (1999) :
కళాఖండాల వ్యాపారి అలెక్ వైల్డెన్స్టీన్ విడాకులు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. భార్య జోస్లిన్‌కు సుమారు సుమారు రూ.35వేల కోట్లు విలువైన సెటిల్మెంట్ లభించినట్లు అంచనా..
4. రూపర్ట్ మర్డోక్ – అన్నా డిపెస్టర్ (1999) :
మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్, అన్నా డిపెస్టర్ విడాకులు కూడా భారీ భరణంగా నిలిచాయి.. సుమారు రూ.16,150 కోట్లు సెటిల్మెంట్ జరిగినట్లు అంచనా..
5. జెఫ్ బెజోస్ – మెకంజీ స్కాట్ జెజోస్ (2019):
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ విడాకులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సుమారు రూ.3.20 లక్షల కోట్ల విలువైన అమెజాన్ షేర్లు మెకంజీ స్కాట్‌కు దక్కాయి. ఒక్క విడాకుల సెటిల్మెంట్ తోనే ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు..
సంపాదించడం ఎంత కష్టమో.. ఆ సంపదను షేర్ చేయడం కూడా అంతే పెద్ద వ్యవహారమేనని ఈ విడాకుల ఉదంతాలు చెబుతున్నాయి. సామాన్యుల జీవితాల్లో విడాకులు ఓ వ్యక్తిగత నిర్ణయమైతే.. బిలియనీర్ల ప్రపంచంలో మాత్రం అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి..
