TVK Vijay Alliance: విజయ్ కీలక నిర్ణయం.. ఆ పార్టీలతో కలవం.. పొత్తులపై క్లారిటీ.. కలిసొచ్చే పార్టీలివే..
TVK Vijay Alliance Parties: ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్‌తో కలవడం దాదాపు ఖాయమైనట్లు టీవీకే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే విజయ్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- May 5, 2026 / 12:02 PM IST
TVK Vijay Ready to Alliance with Congress CPM CPI Other Parties
TVK Vijay : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభజనం సృష్టించింది. 108 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో టీవీకేకు మరో 10మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఏఏ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. దీంతో ఇవాళ విజయ్ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్‌ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం అయ్యారు. ఏఏ పార్టీలను కలుపుకొని వెళ్లాలనే అంశంపై చర్చించారు. ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో కలవకూడదని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (5), పీఎంకే(4), విసికే(2), సీపీఎం(2), సిపిఐ(2), డిఎండికే (1) పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్‌తో కలవడం దాదాపు ఖాయమైనట్లు టీవీకే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే విజయ్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పొత్తుల విషయంపైనా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. టీవీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విజయ్ తో రాహుల్ చెప్పినట్లు సమాచారం.
టీవీకేతో పొత్తుపట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి సానుకూలతగా ఉండటంతోపాటు.. పీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, డీఎండీకే పార్టీలు కూడా సుమఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే విజయ్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారని, బుధవారం ఉదయం నాటికి పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందని, ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అవుతాయని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
