వెరీ వెరీ స్పెషల్ : ఈ గొడుగులో ఫ్యాన్ ఉంది
- chvmurthy
- Published On : May 4, 2019 / 11:01 AM IST
ఒక పక్క ఎండ మండిపోతోంది… గాలిలో తేమ శాతం తగ్గింది. ఎండలో తిరగాలి అంటే చిన్నా, పెద్దా ఎవరైనా సరే ఠారెత్తి పోతున్నారు. కానీ కేరళలోని ఈ పెద్దాయన్ని చూడండి ఎండలో గొడుగు వేసుకుని ఎంత కూల్ గా వెళుతున్నాడో … ఏంటా ఎలా వెళుతున్నాడా అనుకున్నారా…. కాస్త బుర్ర ఉపయోగించాడు. ఎండలో తిరగుతూ తన పని చేసుకోవాలనుకున్నాడు. కొత్త వస్తువును తయారు చేశాడు.
రెగ్యులర్ గా వాడే గొడుగులో చిన్న ఫ్యాన్ బిగించుకున్నాడు. అంతే… ఎండలోనూ ఉపశమనం పొందుతూ హ్యాపీ గా తన పనులు పూర్తి చేసుకుంటున్నాడు. ఇది ఎట్టా పని చేస్తుందనుకుంటున్నారా…ఫ్యాన్ తిరగటానికి గొడుగు పైన రెండు చిన్న సోలార్ ప్యానల్స్ బిగించాడు. వాటి ద్వారా విద్యుదుత్పత్తి అయి గొడుగులోని ఫ్యాన్ తిరుగుతుంది. అంతే ఎంత ఎండ ఉన్నా హాయిగా తన పనులు కానిచ్చేసుకుంటున్నాడు. ఒకసారి మీరు ట్రై చేస్తారేంటి…..
#FrugalInnovation to solve real problem.. #whatsappwonderbox pic.twitter.com/c0fSj3HrF8
— Shadakshari Swamy (@shadaksharis) May 1, 2019
