Alcohol Prices Increase : బడ్జెట్ దెబ్బతో మద్యం రేట్లకు రెక్కలు.. ఏ బ్రాండ్ మద్యం ధర ఎంత పెరిగిందంటే?
Alcohol Prices Increase : ఈసారి బడ్జెట్లో ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్ మీద ఉండే ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్ (టీసీఎస్)ను గతంలో ఉన్న 1శాతం నుంచి 2శాతానికి పెంచారు.
- Harishth Thanniru
- Published On : February 3, 2026 / 01:58 PM IST
Alcohol Prices Increase
Alcohol Prices Increase : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విజన్ -2047, వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అయితే, ఈ బడ్జెట్‌లో పలు రంగాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను తగ్గించారు. కాగా.. ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్రాండెండ్ మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి.
Also Read : India US Trade Deal : ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఏఏ రంగాలకు ప్రయోజనం
కేంద్ర బడ్జెట్‌లో మద్యం ప్రియులకు నిర్మలా సీతారామన్ బిగ్ షాకిచ్చారు. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాత ధరలతో పోల్చితే ఇప్పుడు మద్యం బాటిల్ కొనాలన్నా.. సిగరెట్ ప్యాకెట్ కొనాలన్నా జేబుకు పెద్ద చిల్లే పడుతోంది.
ఈసారి బడ్జెట్లో ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్ మీద ఉండే ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్ (టీసీఎస్)ను గతంలో ఉన్న 1శాతం నుంచి 2శాతానికి పెంచారు. ఇది చిన్న మార్పులా అనిపించినా.. సప్లయ్ చైన్ ద్వారా తయారీదారుల నుండి వినియోగదారుడికి చేరే సరికి ధర భారీగానే పెరుగుతుంది. అంటే విక్రేతలు కొనుగోలుదారుల నుంచి అటువంటి అమ్మకాలపై అధిక రేటుతో పన్ను వసూలు చేస్తారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్సైజ్ సుంకాలను సవరించే అవకాశం ఉండడంతో ధరల పెరుగుదల అనివార్యంగా మారింది. తాజాగా.. టీసీఎస్‌ను 2శాతంకు పెంచడం ద్వారా గతంలో రూ. వెయ్యి ఉన్న ఒక మద్యం బాటిల్ ధర ఇప్పుడు సుమారు రూ. 100 పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా ఉండే ఎక్సైజ్ నిబంధనలను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.
గతంలో ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాల్లోని సెల్లర్స్ కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆల్కహాల్ సెల్లర్లకు మంచి జరిగినా.. మద్యం తాగే వారికి మాత్రం భారీ తప్పేలా లేదు. మద్యం రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కేవలం ఆల్కహాల్ రేట్లు మాత్రమే కాదు.. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది.
