Delimitation Bill 2026: దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదు- డీలిమిటేషన్ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

దక్షిణాదికి బీజేపీ వ్యతిరేకం అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఫైర్ అయ్యారు.

  • Updated on- April 16, 2026 / 06:50 PM IST
  • దక్షిణాది రాష్ట్రాలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
  • డీలిమిటేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం ఉండదు
  • దక్షిణ భారత్ లో లోక్ సభ సీట్లు పెరుగుతాయి

Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లుపై లోక్ సభలో వివరణ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏపీలో లోక్ సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతుందన్నారు. తెలంగాణలో లోక్ సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కి పెరుగుతుందన్నారు.

తమిళనాడులో లోక్ సభ స్థానాలు 59కి పెరుగుతాయన్నారు. కర్నాటకలో లోక్ సభ సీట్లు 28 నుంచి 42 కి పెరుగుతాయన్నారు. ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు 129 నుంచి 195కి పెరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరికి అన్యాయం జరుగుతుందో చెప్పాలన్నారు. దక్షిణాదికి బీజేపీ వ్యతిరేకం అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్ షా ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని, డీలిమిటేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also Read: మహిళా బిల్లును వ్యతిరేకిస్తే శిక్ష తప్పదు, రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదు – ప్రధాని మోదీ

”50శాతం ఎంపీ సీట్ల పెంపుపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఏక రీతిన అన్ని రాష్ట్రాల్లో 50శాతం మేర సీట్లు పెరుగుతాయి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లు 50 శాతం మీద పెరుగుతాయి. 543 ఎంపీ స్థానాల్లో ఏపీకి ఉన్న 25 నియోజకవర్గాల ప్రకారం లోక్ సభలో ఆ రాష్ట్ర వాటా నిష్పత్తి 4.60 గా ఉంది. 50శాతం మేర 38 సీట్లకు పెరిగి ఏపీ ప్రాతినిధ్యం వాటా అదే శాతం 4.60 ఉంటుంది. ప్రస్తుత లోక్ సభలో 17 ఎంపీ స్థానాలతో తెలంగాణ నిష్పత్తి 3.30 శాతంగా ఉంది. 25 సీట్లకు పెరిగి తెలంగాణ వాటా నిష్పత్తి 3.30 శాతంగా ఉంటుంది. ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి గానీ దేశంలో ఏ రాష్ట్రానికి గానీ అన్యాయం జరగదు” అని అమిత్ షా స్పష్టం చేశారు.