Karnataka : సీఎం సార్.. ఆరు గ్యారెంటీలు కాదు.. ఏడు గ్యారెంటీలు.. పెళ్లిని కూడా చేర్చాలన్న యువకుడు

Karnataka : కర్ణాటకలోని పిరియాపట్నలో నిర్వహించిన ప్రజా సేవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అటెండయ్యారు. ఈ సందర్భంగా ఓ యువరైతు సీఎంకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తమలాంటి పెండ్లికాని రైతులకు కూడా ఓ పథకం తీసుకురావాలని 35ఏళ్ల యువత రైతు సీఎంను రిక్వెస్ట్ చేశాడు.

unmarried Farmer asks Karnataka CM DK Shivakumar for scheme to help unmarried Farmer

Unmarried Farmers Marriage Scheme : దేశానికి రైతే వెన్నెముక అంటూ నిత్యం రాజకీయ నేతల నుంచి ప్రతీఒక్కరూ జపిస్తున్నా.. వ్యవసాయం చేసే రైతుల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.. ఆర్థికంగా బలోపేతం అవడం అటుంచితే.. ఫామింగ్ చేస్తూ జీవనం సాగించే గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పెండ్లిళ్లు కాని పరిస్థితి. ఎకరాల కొద్దీ పొలాలు ఉన్నా.. ఆస్తులు ఉన్నా.. అమ్మాయిలు మాత్రం పట్టణాల్లో ఉద్యోగాలు చేసే వారిని పెండ్లి చేసుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషయంపై ఓ యువరైతు తన ఆవేదనను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముందు చెప్పుకున్నాడు. సీఎం సార్.. ఆరు గ్యారెంటీలు కాదు.. ఏడు గ్యారెంటీలు.. పెళ్లిని కూడా మీ గ్యారెంటీల్లో చేర్చండి అంటూ విజ్ఞప్తి చేశాడు.. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read : TG Electricity Charges Hike : విద్యుత్ వినియోగదారులకు బిక్ షాక్.. వచ్చే నెల నుంచి ఛార్జీ మోత షురూ.. ఎంతంటే?

కర్ణాటకలోని పిరియాపట్నలో నిర్వహించిన ప్రజా సేవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అటెండయ్యారు. ఈ సందర్భంగా ఓ యువరైతు సీఎంకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తమలాంటి పెండ్లికాని రైతులకు కూడా ఓ పథకం తీసుకురావాలని 35ఏళ్ల యువత రైతు సీఎంను రిక్వెస్ట్ చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది రైతుల పరిస్థితి ఇలాగే ఉందని.. వ్యవసాయ భూములు, ఇళ్లు ఉన్నప్పటికీ గ్రామీణ యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఆసక్తి చూపడం లేదని చెప్పుకొచ్చాడు.. తమలాంటి వారికి ప్రభుత్వం ‘పెళ్లి గ్యారెంటీ’ వంటి పథకాలను ప్రవేశపెట్టి ఏదైనా సహాయం చేయాలని కోరాడు.

గ్రామాల్లో 35 నుంచి 40ఏళ్ల ఏజ్ వచ్చినప్పటికీ మ్యారేజ్ అవ్వని పురుషులు చాలామంది ఉన్నారుఎకరాల కొద్దీ భూమి ఉన్నా.. ఆస్తులు ఉన్నా.. గ్రామీణ యువకులను వివాహం చేసుకునేందుకు యువతులు ముందుకు రావడం లేదంటూ ఆ యువ రైతు వాపోయాడు. తమ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పెండ్లి కాని రైతులకు పెళ్లి సంబంధాలు కుదిరేలా ‘పెళ్లి గ్యారెంటీ’ లాంటి ఏదైనా పథకం తీసుకురావాలని రైతు కోరాడు.. యువరైతు విన్నపం విన్న డీకే శివకుమార్ నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. ఈ వినూత్న విజ్ఞప్తి వెనుక గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న సామాజిక సమస్యపై చర్చ మొదలైంది.

వ్యవసాయంపై ఆధారపడే యువకులకు పెళ్లి సంబంధాలు దొరకడం కష్టమవుతోందన్న అంశం కర్ణాటకలో గతంలోనూ చర్చకు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కునిగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.డి. రంగనాథ్ కూడా రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మొత్తానికి.. ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీల జాబితాలో తమకు కూడా ‘పెళ్లి గ్యారెంటీ’ కావాలంటూ రైతు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే, ఇదే సమస్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉంది. మరి పెండ్లి యువ రైతులకోసం ప్రభుత్వాలు ఏమైనా కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాయో చూడాలి మరి.