×
Ad

Priyanka Gandhi : బీజేపీ కార్యకర్తకు బ్రేస్ లెట్ ఇచ్చేసిన ప్రియాంకా గాంధీ

యూపీ ఎన్నికల రోడ్ షోలో బీజేపీ కార్యకర్తకు ప్రియాంకా గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ యువకుడు అడిగాడని తన బ్రేస్ లెట్ ఇచ్చేసారు ప్రియాంకా గాంధీ.

  • Published On : February 23, 2022 / 03:25 PM IST

Bjp Workers  Shake Hand With Priyanka Gandhi

BJP Workers  Shake Hand With Priyanka Gandhi : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని, ఆ పార్టీ విధానాలను విమర్శిస్తారు. కానీ బీజేపీ కార్యకర్తలతో మాత్రం స్నేహంగా మాట్లాడారు.వారికి హేక్ హ్యాండ్ ఇచ్చారు.ఆప్యాయంగా పలుకరించారు. బీజేపీ కార్యకర్తలు ఆమెతో షేక్ హ్యాండ్ తీసుకోవటానికి ఉత్సాహంపడగా..వారితో ప్రియాంకా గాంధీ ఆప్యాయంగా హేక్ హ్యాండ్ ఇచ్చారు.అంతేకాదు ఓ వ్యక్తి ఆమె బ్రేస్ లెట్ అడగగా ఏమాత్రం సందేహంచకుండా ఆమె తన చేతికున్న బ్రేస్ లెట్ తీసి ఇచ్చేశారు. ఈ ఆసక్తికర పరిణామం యూపీ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకుంది.

బీజేపీ, కాంగ్రెస్ అంటేనే ఉప్పు–నిప్పులా ఉంటాయి. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాయి. యూపీ ఎన్నికల క్రమంలో ప్రచారంలో మాటల తూటాలు పేల్చుకున్నారు.అటువంటిది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో షేక్ హ్యాండ్, సెల్ఫీల కోసం బీజేపీ కార్యకర్తలు ఎగబడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా లక్నోలో రోడ్ షో ముగించుకుని ఆమె తిరిగి వెళ్తుండగా.. బీజేపీ ప్రచార సభకు వెళ్లి వస్తున్న ఆ పార్టీ కార్యకర్తలూ అదే దారిలో ఎదురుపడ్డారు.

దీంతో ఆమె కారు ఆపారు. ఆమె కారు ఆగేసరికి బీజేపీ కార్యకర్తలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. మరికొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కొందరు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ మేనిఫెస్టోను అడిగి తీసుకున్నారు. ఇంకో యువకుడు వచ్చి ఆమె వేసుకున్న బ్రేస్ లెట్ ను అడగ్గా.. ఆమె కాదనకుండా ఏమాత్రం సందేహించకుండా తీసి ఇచ్చేశారు.

ఆ వీడియోను కాంగ్రెస్ యూపీ విభాగం ట్వీట్ చేసింది. రాజకీయాల్లో ఇలాంటి చిత్రాలు చాలా అరుదని..యువత ఇప్పుడు గొడవలు, విద్వేషాలను కోరుకోవడం లేదని, ఉద్యోగాలు కావాలంటున్నారని, అందుకు బీజేపీ ప్రచార సభకు వెళ్లి వస్తున్న ఈ యువతే నిదర్శనమని ట్వీట్ లో వెల్లడించింది.