UP Crime: మహిళపై మరిది.. అతని స్నేహితుడు అత్యాచారం
ఒంటరి మహిళను తుపాకీతో బెదిరించడమే కాకుండా.. వరుసకు మరిది అయ్యే వ్యక్తే, స్నేహితుడితో కలిసి అత్యాచారానికి
- Subhan Ali Shaik
- Published On : April 2, 2021 / 11:13 PM IST
Up Man Rapes Sister In Law Threatens To Kill Her
UP Crime: ఒంటరి మహిళను తుపాకీతో బెదిరించడమే కాకుండా.. వరుసకు మరిది అయ్యే వ్యక్తే, స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. యూపీలోని మీరట్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా నిజాలు వెలుగుచూశాయి.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్ జిల్లాలో ఉంటున్న బాధిత మహిళ భర్త తాగుబోతు. కొంతకాలం కిందట భర్త ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కతే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటి నుంచో ఒంటరిగా ఉంటున్న వదినను చూసి ఓ వ్యక్తికి దురాలోచన వచ్చింది.
గురువారం రాత్రి ఒంటరిగానే ఉందని నిర్ధారించుకున్న వ్యక్తి గురువారం రాత్రి బాధితురాలి ఇంటి గోడ దూకాడు. అతనితో పాటు మరో యువకుడిని వెంట తీసుకుని రావడంతో ఇద్దరు వ్యక్తులను ఆమె గమనించింది.
భయంతో కేకలు వేసి కాపాడాలని అరుస్తుండగా తమతో తెచ్చుకున్న తుపాకీతో ఆమెను బెదిరించారు. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి జరిపి దారుణంగా హింసించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్న మహిళ మరుసటి శుక్రవారం సదరు మహిళ మీరట్ పోలీసు స్టేషన్లో తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
