గర్భంలో ఉన్నది ఆడ, మగ తెలుసుకోవడానికి కడుపును కోశాడు

  • Publish Date - September 20, 2020 / 11:59 AM IST

UP Man Rips Open Pregnant : గర్భంలో ఉన్నది ఆడ, మగ తెలుసుకోవడానికి ఏకంగా కడుపునే కోశాడు దుర్మార్గుడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన యూపీ రాష్ట్రం చోటు చేసుకుంది. Civil Lines police station పరిధిలోని Nekpur లో పన్నాలాల్, దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరికి ఐదుగురు కుమార్తెలు. మరోసారి గర్భం దాల్చంది. ఈసారి కూడా ఆడ పిల్ల పుడుతుందా ? మగ పిల్ల పుడుతుందా ? అనే అనుమానం కలిగింది పన్నాలాల్ కి. ఆరు, ఏడు నెలల గర్భాన్ని పదునైన కత్తితో కత్తిరించడంతో తీవ్ర రక్తస్రావమైందని, బరేలి ఆసుపత్రికి తరలించినట్లు senior police official (City) Pravin Singh Chauhan వెల్లడించారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, దీనిపై FIR నమోదు చేశామన్నారు. కడుపులో ఉన్నది మగ, ఆడనా తెలుసుకోవడానికి ఇలా చేశాడని, అతడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.