×
Ad

UP Polls 2022 : స్నానం చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ఎన్నికల ప్రచారం

ప్రతింటికి తిరుగుతూ..ఓటు తనకే వేయాలని అభ్యర్థించారు. అలాగే ఓ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి స్నానం చేస్తున్నాడు. అయినా..సురేంద్ర వెనక్కి వెళ్లకుండా...

  • Published On : January 14, 2022 / 01:16 PM IST

Up Bjp Mla

BJP Mla Surendra Maithani : ఎన్నికలు వచ్చాయంటే…చాలు అభ్యర్థలు పడరాని పాట్లు పడుతుంటారు. టికెట్ కన్ఫామ్ అయిపోగానే…ప్రచారబరిలో దిగుతుంటారు. వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. ఒకరు దోశ, మరొకరు అంట్లను తోమడం, ఇంకొకరు చిన్న పిల్లలకు స్నానం చేయడం వంటివి చేస్తూ..ఓటు వేయాలని కోరుతుంటారు. ఇలాగే…యూపీలో చోటు చేసుకుంది. ఇక్కడ త్వరలోనే ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…కాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైథానీ గురువారం తన నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Read More : Nun Rape Case : క్రైస్తవ సన్యాసిని రేప్ కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

ప్రతింటికి తిరుగుతూ..ఓటు తనకే వేయాలని అభ్యర్థించారు. అలాగే ఓ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి స్నానం చేస్తున్నాడు. అయినా..సురేంద్ర వెనక్కి వెళ్లకుండా…అతని మాట్లాడాడు. స్నానం చేస్తున్న వ్యక్తి కొంత ఇబ్బందికి గురయ్యాడు. అంత బాగానే ఉందా ? రేషన్ కార్డు ఉందా..అంటూ ప్రశ్నలు సంధించారు. దీనికి ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మెల్యే సురేంద్ర తన ఇన్ స్ట్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన గృహపథకం కింద ఇంటిని నిర్మించుకున్న లబ్దిదారుడి ఇంటికి తాను వెళ్లడం జరిగిందని, ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించినట్లు సదరు ఎమ్మెల్యే పోస్టులో పేర్కొన్నారు.