UP Woman Rs 10 Cr : మహిళా రైతు ఖాతాలో రూ.10 కోట్లు.. ఆమె ఇచ్చిన షాక్ మాములుగా లేదుగా..!
UP Woman Rs 10 Cr : ఓ మహిళా రైతు ఖాతాలో అకస్మాత్తుగా రూ.10 కోట్లు జమ అయ్యాయి. మరి ఆమె ఏం చేసింది.. చివరకు ఆ డబ్బును ఎవరు తీసుకున్నారంటే
- Dharani Pilli
- Published On : March 29, 2026 / 03:03 PM IST
UP Rs 10 Crore Credited in farmers wife account Due To Bank Error
UP Woman Rs 10 Cr : అప్పుడప్పుడు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం, లేదంటే సిస్టమ్ లో సమస్య తలెత్తితే అనుకోకుండా కొందరి ఖాతాలో ఎక్కువ మొత్తంలో డబ్బులు జమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఆ డబ్బులను ఖర్చు చేస్తుంటారు. కానీ ఓ రైతు భార్య ఖాతాలో 1,2 కాదు.. ఏకంగా రూ.10 కోట్లు జమ చేశారు. విషయం తెలుసుకున్న సదరు దీనిపై స్పందిస్తూ చేసిన కామెంట్ వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. బిచ్వాన్ ప్రాంతంలోని దేవ్గన్ గ్రామంలో పరస్భాన్ అనే వ్యక్తి తన భార్య రేఖతో కలిసి జీవిస్తుండేవాడు. వ్యవసాయమే వారికి జీవనాధారం.
ఇదిలా ఉంటే మొన్నటి వరకు దేశమంతా చైత్ర నవరాత్రులు పాటించారు. రేఖ కూడా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించుకుంది. ఈక్రమంలో అష్టమి నాడు పూజ చేసుకున్న తర్వాత రేఖ తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి స్థానికంగా ఉన్న బ్యాంక్ కి వెళ్లింది. కానీ ఆరోజు అది తెరవలేదు. దీంతో డబ్బులు డ్రా చేసుకోవడం కోసం ఆమె ఏటీఎంకి వెళ్లింది. ముందు తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవాలని భావించింది. ఏటీఎం కార్డ్ పెట్టి.. పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆమె ఖాతాలో ఉన్న మొత్తం ఏటీఎం మెషిన్ లో డిస్ ప్లే అయ్యింది. అది చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
కారణం రేఖ ఏటీఎంలో ఒక్కటి, రెండు కాదు ఏకంగా రూ.10 కోట్లు ఉన్నట్లు చూపించింది. రేఖ ఖాతాలో సరిగ్గా రూ.9,99,49,588 కోట్లు ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చి మరొక ఏటీఎం దగ్గరకు వెళ్లి మరొకసారి మనీ చెక్ చేసింది. ఈసారి వీడియో రికార్డ్ చేసుకుంది. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా రేఖ ఖాతాలో రూ.9,99,49,588 కోట్లు ఉన్నట్లు చూపించింది. అయితే తన ఖాతాలో అంత మొత్తం డబ్బులు చూసిన రేఖ వాటిలోంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేదు. ఆ డబ్బుల గురించి తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. పైగా ఆ మొత్తం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది.
మరుసటి రోజు రేఖ, ఆమె కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయం గురించి అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్.. సాంకేతిక లోపం వల్ల ఇలాంటి సమస్య తలెత్తిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ప్రతి ఒక్కరు రేఖ నిజాయతీని ప్రశంసిస్తున్నారు. సమాజంలో చాలా మందికి మీకున్నంత ధైర్యం లేదని కొనియాడుతున్నారు.
