Peace Agreement: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. సంతకాలు చేసిన ఇరు దేశాలు

దీర్ఘకాలిక శత్రుత్వానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి(Peace Agreement) ఒప్పందంపై సంతకాలు చేశాయి.

us and iran sign historic peace agreement ending three month war

  • అమెరికా, ఇరాన్‌ల చారిత్రాత్మక శాంతి ఒప్పందం.
  • మూడు నెలల యుద్ధానికి ముగింపు.
  • ఉల్లంఘిస్తే బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరిక.

Peace Agreement: దీర్ఘకాలిక శత్రుత్వానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందం(Peace Agreement)పై సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిజిటల్ పద్ధతిలో ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంతో, గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గత మూడు నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి ఈ ఒప్పందంతో తెరపడింది. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అతి త్వరలోనే తిరిగి తెరుచుకోనుంది.

Fuel Prices: పెట్రోల్ ధరలు తగ్గించం.. కేంద్ర ప్రభుత్వంపై 12,000 కోట్ల భారం.. కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు

జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వర్సైల్లెస్ ప్యాలెస్ వేదికగా ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు స్వయంగా ధృవీకరించారు. మరోవైపు, ఇరు దేశాల అధ్యక్షుల ఆమోదంతో ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ పూర్తయిందని, ఇప్పుడు దీని అమలును పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్ పేర్కొన్నారు.

అయితే, ఈ శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ అవగాహన ఒప్పందం ఎంతమాత్రం తుది నిర్ణయం కాదని స్పష్టం చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ మోసపూరిత వైఖరినే అవలంబిస్తోందని ఆరోపించిన ట్రంప్, ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే లేదా తనకు నచ్చని విధంగా వ్యవహరిస్తే.. ఆ దేశంపై మళ్లీ బాంబుల వర్షం కురిపించడానికి వెనకాడబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు.