UP: అత్యాచార నిందితులపై యోగి ప్రభుత్వం కొరడా.. ముందస్తు బెయిల్ నిరాకరించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఇంకా ఆయన మాట్లాడుతూ ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల బాలికలపై మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో నిందితులు బాధితులను, ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని, వారికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు.

UP: అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ దొరక్కుండా యోగి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెడ్యూర్ (ఉత్తరప్రదేశ్ అమెండ్‭మెంట్) బిల్-2022 పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు శుక్రవారం ఆమోదం లభించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా.. సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలపై దురాచారాలకు పాల్పడే వారు ముందస్తు బెయిల్ పేరుతో తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల బాలికలపై మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో నిందితులు బాధితులను, ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని, వారికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి సురేష్ కుమార్ ఖన్నా అన్నారు.

ఇక ఈ బిల్లుతో పాటు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ (సవరణ) బిల్లు-2022 బిల్లును సైతం ఈరోజు ఆమోదించారు. అల్లర్లలో ఎవరైనా చనిపోతే, వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా క్లెయిమ్ ట్రిబ్యూనల్‭కు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఈ బిల్లులో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ప్రభుత్వం ఎవరిదైనా ప్రాపర్టీ కూల్చితే దావా వేయడానికి ఇప్పటికే ఉన్న మూడు నెలల సమయాన్ని ఇది మూడు సంవత్సరాలకు పొడగించారు.

Dussehra rally: పంతం నెగ్గించుకున్న ఉద్ధవ్.. షిండే వర్గానికి హైకోర్టు షాక్

ట్రెండింగ్ వార్తలు