BJP MLA Dog Training for ‘Ram..Ram’
BJP MLA Dog Training for ‘Ram..Ram’ : రామ చిలుకలు ‘రామ రామ’ అని అంటాయంటారు. కానీ కుక్కలు ‘రామ రామ’ అని అనటం ఎక్కడన్నా విన్నామా?చూశామా? అంటే లేదనే అంటాం. కానీ ఓ ఎమ్మెల్యేగారు మాత్రం తన పెంపుడు కుక్కకు రామనామ జపం నేర్పిస్తున్నారు. ‘రామ రామ’ అని అను అంటూ కుక్కకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ తివారీ..తన పెంపుడు కుక్కకు ‘రామ్ రామ్’ అని అనటానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. తన యజమాని చెప్పినట్లుగా ఆ కుక్క కూడా రామ్ రామ్ అని అనటానికి ప్రయత్నిస్తోంది. రామ నామం జపింపటానికి ట్రై చేస్తోంది. తన కుక్కకు రామ నామాన్ని నేర్పించే వీడియోను ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇదికాస్తా వైరల్ గా మారింది.