×
Ad

మరో బ్లూడ్రమ్ మర్డర్.. ప్రియుడి మోజులో పడి.. భర్తను ముక్కలు ముక్కలు చేసి..

Lucknow : దేశంలో సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్’ మర్డర్ లాంటి ఘోరం ఉత్తరప్రదేశ్‌లోనే మరొకటి చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి

Lucknow

Lucknow : దేశంలో సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్’ మర్డర్ లాంటి ఘోరం ఉత్తరప్రదేశ్‌లోనే మరొకటి చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కులుగా చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో మూటకట్టి బ్లూ డ్రమ్ములో వేసింది. ఈ దారుణ ఘటన సంభల్ జిల్లా చందౌసీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Also Read: Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

చందౌసీ ప్రాంతంలో రాహుల్ (40) అనే వ్యక్తి షూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూబీ అనే మహిళతో అతనికి 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 12ఏళ్ల కొడుకు, 10ఏళ్ల కుమార్తె ఉంది. అయితే, రూబీకి కొన్నాళ్ల క్రితం గౌరవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గౌరవ్, రూబీ వ్యవహారంపై భర్త రాహుల్‌కు అనుమానం రావడంతో రూబీని ప్రశ్నించాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని రూబీ భావించింది. దీంతో ప్రియుడుతో కలిసి భర్త రాహుల్ హత్యకు స్కెచ్ వేసింది.

ఈనెల 18న రూబీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త రాహుల్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూబీ వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆమె చెప్పిన ఆధారాలతో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా.. పట్రౌవా రోడ్డులో ఈద్గా దగ్గర పాలిథీన్ బ్యాగుల్లో మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. చేతులు, కాళ్లు, మొండెం ఇలా వేరువేరుగా ఉన్నాయి. దొరికిన చేతిపై రాహుల్ అని పచ్చబొట్టు ఉండటంతో పోలీసులు శరీర భాగాలు రాహుల్‌విగా గుర్తించారు. దీంతో రబీ, ఆమె ప్రియుడు గౌరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ పదేళ్ల కుమార్తె పోలీసులతో మాట్లాడుతూ.. తరచూ ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చేవారని చెప్పింది. వారు తమకు చాక్లెట్లు తెచ్చేవారని తెలిపింది. రాహుల్ ను ఇంట్లోనే హత్యచేసినట్లు భావిస్తున్న పోలీసులు. ఇంట్లోని కాట్ లెగ్, స్కూటర్, బ్యాగ్, టాయిలెట్ బ్రష్, ఐరన్ రాడ్, ఎలక్ట్రిక్ హీటర్ లాంటివి ఆధారాలు సేకరించారు. అయితే, రాహుల్ శరీర భాగాలను ముక్కలుగా చేసి వేరువేరు ప్రాంతాల్లో రూబీ, గౌరవ్‌లు పడేశారు. దీంతో మరికొన్ని శరీరభాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తల భాగం ఇంకా దొరకలేదు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.