UttarPradesh : ఫేస్‌బుక్‌లో భార్య పోస్ట్.. భయంతో ప్రియుడి దగ్గరికి పంపించేసిన భర్త.. అందులో ఏముందంటే?

UttarPradesh : భార్య పేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు చూసి భర్త వణికిపోయాడు. ఆ తరువాత భార్యను స్వయంగా ప్రియుడితో పంపించేశాడు.

UttarPradesh

UttarPradesh : భార్య పేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు చూసి భర్త వణికిపోయాడు. అంతేకాదు.. ఆమె ఫోన్ గ్యాలరీలో నగ్న ఫొటోలు చూసి కంగుతిన్నాడు. ప్రియుడితో తిరుగుతున్నట్లు గుర్తించాడు. ఇంకా.. ఆమెతో కలిసి ఉంటే ప్రియుడితో కలిసి తనను ఎప్పుడైనా చంపేస్తుందన్న భయంతో భర్త ఓ నిర్ణయానికి వచ్చాడు. మధ్యవర్తుల ద్వారా ఎవరితో జీవించాలని అనుకుంటుందో చెప్పాలని సూచించాడు. భర్త నాకు వద్దు.. ప్రియుడితోనే కలిసి ఉంటానని తేల్చి చెప్పడంతో మరోమాట మాట్లాడకుండా భర్త తన భార్యను ప్రియుడి వద్దకు పంపించేశాడు. ఆ తరువాత నేను చావు నుంచి తప్పించుకున్నానంటూ సంతోషపడ్డాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

Also Read: Gold Price Today : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కారణాలు ఇవే.. గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా..? ఫుల్ డీటెయిల్స్

యూపీలోని బులందర్‌షెహర్‌కు చెందిన రాజ్ కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. వారికి ఆరు నెలల పాప కూడా ఉంది. భార్య తరచూ గొడవపడి పుట్టింటికి వెళ్లేది. అక్కడ ప్రియుడితో కలిసి తిరిగేది. అయితే, పలుసార్లు భార్య ప్రవర్తనపై రాజ్‌కుమార్‌కు అనుమానం వచ్చింది. దీంతో భార్యను నిలదీయడంతో నేను ఎవరితోనైనా తిరుగుతున్నాననడానికి సాక్ష్యం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నించింది. పైగా తనను అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ రాజ్ కుమార్ పైనే ఎదురుదాడి చేసింది. అయితే, ఇటీవల భార్య ఫోన్ చూసిన రాజ్ కుమార్ కంగుతిన్నాడు.

భార్య ఫోన్ గ్యాలరీలో నగ్న ఫొటోలు ఉన్నాయి. అంతేకాదు.. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో హత్యా కథనాలు కనిపించాయి. గత ఏడాది మార్చిలో మీరట్ ఘటనలో భార్య, తన భర్త‌ను ప్రియుడితో కలిసి హత్యచేసింది. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్‌ డ్రమ్‌లో ఉంచి పైనుంచి సిమెంట్‌తో కప్పేయడం అప్పట్లో సంచలనమైంది. అయితే, భార్య ఫేస్‌బుక్‌లో ‘సిమెంట్‌ ఔర్‌ డ్రమ్‌’, ‘నీలా డ్రమ్‌ ఔర్‌ సిమెంట్‌’ శీర్షికలతో హత్యా కథనాలు పోస్టు చేయడంతో రాజ్‌కుమార్‌ హడలిపోయాడు.

తన భార్యతో ఉంటే ప్రియుడితో కలిసి నన్ను చంపేస్తుందనే భయంతో.. భార్య నుండి విడిపోయేందుకు రాజ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. మధ్యవర్తుల ద్వారా భార్యను ప్రియుడి వద్దకు పంపించేశాడు. ఆ తరువాత నేను చావు నుంచి తప్పించుకున్నానంటూ సంతోషం వ్యక్తం చేశాడు.