10th క్లాస్ ఫెయిల్ అయినవారు ఏం చేస్తారు? ఏడుస్తారు..పెద్దవాళ్లు ఏమన్నా అంటారేమోనని ఇంటినుంచి పారిపోతారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 10th ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫెయిల్ అయిన అబ్బాయి తన ప్రతిభతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. జీవితంలో ఏదన్నా సాధించామనే గుర్తింపు తెచ్చుకోవటానికి పరీక్షల్లో పాస్ కావటం ర్యాంకులు తెచ్చుకోవటమే కాదని నిరూపించాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన ’ప్రిన్స్‘ అనే 17 సంవత్సరాల అబ్బాయి.
నాలుగు సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు ప్రిన్స్. ఒక్క సబ్జెక్టులో కూడా పాస్ కాలేదు.కానీ ప్రతిభలో నాకు సాటి నేనే అనేలా ఏకంగా విమానాలనే తయారు చేసేస్తు అందరి చేతా ‘శెభాష్’ అనిపించుకుంటున్నాడు.
10th ఫెయిల్ అయిన ప్రిన్స్ ను అందరూ మొద్దబ్బాయి అనేవారు.కానీ ప్రిన్స్ మాత్రం ఏదో చేయాలని తపన పడేవాడు. అలా చిన్ని చిన్న విమానాలు తయారు చేయటం నేర్చుకున్నాడు. ఇంటర్ నెట్ లోను..యూ ట్యాబ్ లో ఎంతో సమాచారాన్ని సేకరించాడు. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా రిమోట్ కంట్రోల్ ద్వారా ఎగిరే 35 రకాల చిన్న చిన్న విమానాలను తయారు చేశాడు.
తను తయారు చేసిన విమానాలను..వాటిని ఎగురవేస్తూ వీడియోలు తీశాడు. ఆ వీడియోలను ‘ప్రిన్స్ పంచల్ ’ అనే పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. వాటిని చూసిన ఎంతోమంది ప్రిన్స్ ను అభినందిస్తున్నారు. ప్రిన్స్ తయారు చేసిన విమానాలపై ‘మేకిన్ ఇండియా’ అనే స్టిక్కర్ ని ప్రింట్ చేశాడు.
తను తయారు చేసిన విమానాల గురించి ప్రిన్స్ మాట్లాడుతూ.. తాను ఎలాగైనా సరే 10th కంప్లీట్ చేయాలనుకున్నాననీ..కానీ నువ్వు ఏదోకటి సాధిస్తావురా అంటూ తన తాత చాలా ప్రోత్సహించేవారనీ..10th ఫెయిల్ అయినంత మాత్రాన ఏం కాదంటూ ధైర్యం చెప్పేవారనీ..తాత ఎంకరేజ్ మెంట్ తోనే తనకంటూ ఓ గుర్తంపు లభించిందని అన్నారు. తన కాలనీ వారంతా తనను ‘తారే జమీన పర్ వాలా లడ్కా’ అంటుంటారని నవ్వుతూ చెప్పాడు ‘ విమానాల మేకర్ ప్రిన్స్’.
Vadodara: A 17-yr old, Prince Panchal,who failed in 6 subjects in class 10 has made 35 model planes with the help of internet.The light-weight plane models can fly and are operated with the help of remote control. His first model was made of flex used in the banners/hoardings. pic.twitter.com/1W5ab3BKuX
— ANI (@ANI) November 13, 2019