Kerala CM VD Satheesan : కేరళ సీఎంగా వీడి సతీషన్ ప్రమాణ స్వీకారం.. 20మంది మంత్రులు ప్రమాణం.. మాజీ సీఎం విజయన్‌తోపాటు ప్రముఖులు హాజరు..

Kerala CM VD Satheesan : కేరళ 13వ ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20మంది మంత్రులు ప్రమాణం చేశారు.

Kerala CM VD Satheesan

Kerala CM VD Satheesan : కేరళ 13వ ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఉదయం 10గంటలకు గవర్నర్ ఆర్లేకర్ సతీషన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు 20మంది మంత్రులు ప్రమాణం చేశారు.

Also Read : Bandi Bhagirath Case : బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు..

ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 140 సీట్లకుగాను యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటమి 102 సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న, యూడీఎఫ్ కూటమి విజయంలో కీలక భూమిక పోషించిన వీడీ సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవికి ఎంపిక చేసింది. దీంతో ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేరళ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్‌సుఖు, కర్ణాటక తెలంగాణ డిప్యూటీ సీఎంలు డీకే శివకుమార్, భట్టి విక్రమార్కతో పాటు పలువురు పాల్గొన్నారు.