Vande Bharat First AC Coach : ప్రయాణికులకు పండగే! వందే భారత్‌ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!

Vande Bharat First AC Coach : భారతీయ రైల్వే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముంబై-బెంగళూరు "వందే భారత్ స్లీపర్" రైలులోని మొదటి ఏసీ కోచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. 

Vande Bharat First AC Coach

Vande Bharat First AC Coach : అబ్బా.. ఇది రైలా లేదా హోటలా? అచ్చం లగ్జరీ హోటల్ మాదిరిగా మార్చేశారుగా.. రాబోయే ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు. అద్భుతమైన ఇంటీరియర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో కోచ్ ప్రైవేట్ క్యాబిన్, ప్రీమియం ఇంటీరయర్స్, అదిరిపోయే లైటింగ్, మోడ్రాన్ సౌకర్యాలు కనువిందు చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇకపై రైలు ప్రయాణం లగ్జరీగా ఉంటుంది.

అతి త్వరలో ముంబై, బెంగళూరుల మధ్య కొత్త ‘వందే భారత్ స్లీపర్’ రైలు నడవనుంది. ఇందులో ఫస్ట్ ఏసీ కోచ్‌కు సంబంధించిన ఫస్ట్ వీడియో బయటకు వచ్చింది. ఈ కోచ్ సౌకర్యాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. బాబోయ్.. ఇది లగ్జరీ హోటల్ లేదా ఫైవ్-స్టార్ హోటల్ గదినా అంటూ అబ్బరపోతున్నారు.

Read Also : Hanuman Temple : హనుమాన్ ఆలయంలో విషాదం.. మండపం కూలి ఏడుగురు మృతి, శిథిలాల్లో ఇంకా 25 మంది?

వైరల్ వీడియోను పరిశీలిస్తే.. ఈ రైలులో ఫస్ట్ ఏసీ కోచ్ లోపలి భాగం కనిపిస్తోంది. ఇందులో ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన, ప్రైవేట్ క్యాబిన్‌లు ఉన్నాయి. ఈ కోచ్ అద్భుతమైన లైటింగ్, ప్రీమియం ఫినిషింగ్‌లు, చక్కగా అమర్చిన బెర్త్‌లతో పూర్తిగా మోడ్రాన్ లగ్జరీగా ఉంటుంది.

ప్రత్యేకించి ఈ ‘వందే భారత్ స్లీపర్’ను రాత్రి సమయాల్లో లాంగ్ జర్నీ చేసే ప్రయాణికుల కోసం రూపొందించారు. ప్రస్తుత వందే భారత్ రైళ్లలో ప్రధానంగా చైర్ కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ కొత్త స్లీపర్ వెర్షన్ ప్రయాణికులకు నిద్రపోయేందుకు మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీ కోచ్‌లలో క్యాబిన్‌లు సౌకర్యవంతంగా కనిపిస్తాయి.

స్పెషల్ ఫీచర్లు ఏంటి? :
లగ్జరీ క్యాబిన్ సీట్లు : సౌకర్యవంతమైన నైట్ జర్నీల కోసం లగ్జరీ స్లీప్ ఏర్పాట్లు
హోటల్ తరహా టాయిలెట్లు : పాత, దుర్వాసనతో టాయిలెట్ల స్థానంలో ఇకపై క్లీన్ మోడ్రాన్ బయో-టాయిలెట్ల ఏర్పాటు
అత్యాధునిక భద్రత : ప్రయాణికుల భద్రత కోసం ప్రతి సందులోనూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
డిజిటల్ డిస్‌ప్లే : ప్రయాణ సంబంధిత సమాచారమంతటా మోడ్రాన్ డిస్‌ప్లే స్క్రీన్

వ్యాపార, విహార యాత్రల నిమిత్తం ప్రతిరోజూ వేలాది మంది ముంబై, బెంగళూరుల మధ్య ప్రయాణిస్తుంటారు. ఈ రాత్రిపూట రైలు ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కాలేదు.