Delhi Metro : ఢిల్లీ మెట్రోలో హెయిర్ స్ట్రెయిట్ చేసుకున్నయువతి వీడియో వైరల్ .. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఢిల్లీ మెట్రోలో రీల్స్, వీడియోలు నిషేధమని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ యువతి హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published On : June 18, 2023 / 11:11 AM IST
Delhi Metro
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో వైరల్ వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా ఓ యువతి జుట్టు స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో జంట వీడియో వైరల్..
ఢిల్లీ మెట్రోలో రోజుకో రకం వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొట్లాటలు, వింత డ్రెస్సింగ్, ఆటలు, పాటలు.. ఇలా విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటివన్నీ నిషేధమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పదే పదే హెచ్చరికలు జారీ చేసినా జనం వినే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఓ యువతి మెట్రోలో తన జుట్టుని స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఆ యువతి ఆఫీస్‌కి వెళ్తోందో? పార్టీకి వెళ్తోందో తెలియదు కానీ.. ఈ వీడియో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు యువతులు.. మండిపడుతున్న ప్రయాణికులు
@HasnaZarooriHai అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ‘ సిస్టర్.. వాషింగ్ మెషీన్ తెచ్చుకుని బట్టలు కూడా వాష్ చేసుకో’ అని ఒకరు..’మేడమ్ కింద పడిన జుట్టుని తీసి పారేయండి.. ఇది రైలు మీ ఇల్లు కాదు’ అని మరొకరు ఇలా వరుసగా కోపంగా కామెంట్లు పెట్టారు. ఏదో రకంగా ఫేమస్ అవడం కోసమే ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం అధికారులను కోరుతున్నారు.
Delhi Metro की बात ही अलग है!
?????? pic.twitter.com/zzy6nNLmbA— Hasna Zaroori Hai ?? (@HasnaZarooriHai) June 17, 2023
