Delhi Metro : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు యువతులు.. మండిపడుతున్న ప్రయాణికులు

ఢిల్లీ మెట్రోలో గతంలో ఇద్దరు మహిళల గొడవ వైరల్ అయ్యింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కలకలం రేపింది. తాజాగా ఇద్దరు మహిళలు బూటుతో, వాటర్ ప్లాస్క్‌తో తన్నుకున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు యువతులు.. మండిపడుతున్న ప్రయాణికులు

Delhi Metro

Viral Video : ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఇద్దరు యువతుల ఘర్షణ .. తన్నుకునే వరకూ దారి తీసింది. తోటి ప్రయాణికులు సర్దిచెప్పడంతో యువతులు వెనక్కి తగ్గారు. కానీ మెట్రోలో ఇలాంటి చర్యలపై జనం మండిపడుతున్నారు.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో యువకుడి అసభ్యకర ప్రవర్తన.. తలదించుకొని వెళ్లిపోయిన మహిళలు.. కేసు నమోదు

ఢిల్లీ మెట్రోలో రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా ఇద్దరు యువతులు మెట్రోలో విపరీతంగా ఘర్షణ పడ్డారు. తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. కారణం ఏమో కానీ ఒక యువతి బూటుతో మరో యువతిని బెదిరించింది. మరో యువతి ఆమెపై చేతిలో వాటర్ ప్లాస్క్‌తో దాడికి దిగింది. అందులో ఉన్న నీరు ఆమెపై పోసింది. తోటి ప్రయాణికులు శాంతింపచేయడానికి ప్రయత్నించినా ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. గొడవ మధ్యలో ఓ మహిళ తన ప్రత్యర్ధిపై చర్య తీసుకోవాలని ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా రైలు డ్రైవర్‌కు తన సమస్యను చెప్పుకుంది. అయితే తోటి ప్రయాణికుల పరిస్థితిని గమనించి గొడవ పడవద్దని వారికి సలహా ఇచ్చారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్

Hasna Zaroori Ha అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలామంది యువతులిద్దరిపై దుమ్మెత్తిపోశారు. ‘ఢిల్లీ మెట్రోలో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుందని’.. ‘తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని తెలియడం లేదా?’ అంటూ ఫైరయ్యారు. ఆఫీసులకి, అర్జంటు పనుల మీద బయటకు వెళ్లే ఎంతోమంది ప్రయాణికులకు ఇలాంటి వారి వల్ల ఇబ్బంది ఎదురవుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో పోలీసింగ్ వ్యవస్థను ప్రవేశ పెడతాం అన్న మెట్రో అధికారులు దాన్ని ఎప్పటి వరకూ అమలు చేస్తారో తెలియదు కానీ అప్పటి వరకు ఇలాంటి సినిమాలు చూడాల్సిందే అని జనం వాపోతున్నారు.