Mumbai : లోకల్ ట్రైన్‌లో గర్బా డాన్స్ చేసిన ప్రయాణికుల వీడియో వైరల్
లోకల్ ట్రైన్ అనగానే ఎప్పుడూ కొట్లాటలు గుర్తుకొస్తాయి. నవరాత్రుల వేళ ముంబయి లోకల్ ట్రైన్ మాత్రం సందడిగా మారిపోయింది. ఎప్పుడూ బిజీగా తమ గమ్యస్ధానాలకు వెళ్లే ప్రయాణికులు ఏం చేసారో చూడండి.
- Lakshmi 10tv
- Published On : October 22, 2023 / 02:49 PM IST
Mumbai
Mumbai : ఓ వైపు నవరాత్రుల వేడుకలు జరుగుతుంటే ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులు గర్బా డాన్స్ చేయడం వైరల్‌గా మారింది.
Sameer Wankhede : ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన సమీర్ వాంఖడేకు బెదిరింపు
ముంబయిలో ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని సందడిగా మార్చుకున్నారు. నవరాత్రుల వేళ ప్రయాణికులు గర్బా డ్యాన్స్‌కి స్టెప్పులు వేసారు. వీరి డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల మనసు దోచుకుంది. ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటే ముంబయి సిటీలో నవరాత్రి వేళ ప్రయాణికులు తమ ఆనందాన్ని ఇలా పంచుకునేందుకు ప్రయత్నించారు.
MS Dhoni: ముంబయిలో మహేంద్ర సింగ్ ధోనీతో రామ్ చరణ్.. మరోసారి ఇరువురి ఫ్యాన్స్ కు పండుగేనా?
యువకుల నుండి వృద్ధుల వరకు ట్రైన్‌లో గర్బా డ్యాన్స్ చేసారు. కొందరు వారిని ఉత్సాహ పరిచారు. @mumbaiheritage అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలు పొందింది. ‘ముంబయి లోకల్ ట్రైన్‌లో గర్బా .. వావ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. తమకి కూడా ఈ డ్యాన్స్‌లో పాల్గొనాలనిపించింది అని మెసేజ్ చేసారు.
Garba in Mumbai Local pic.twitter.com/Xd4MtiQsGu
— Mumbai Heritage (@mumbaiheritage) October 18, 2023
