Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువతుల పోల్ డ్యాన్స్ .. DMRC ఎందుకు పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు యువతులు మెట్రోలో 'పోల్ డ్యాన్స్' చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్ని కించపరుస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Lakshmi 10tv
- Published On : July 8, 2023 / 06:19 PM IST
Delhi Metro
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు ‘పోల్ డ్యాన్స్’ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారంతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవల్ని కించపరుస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువకుడిని తిట్టి, చెంప దెబ్బ కొట్టిన మహిళ వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో వీడియోలు రికార్డ్ చేయడం నిషేధమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పదే పదే హెచ్చరికలు జారీ చేసినా కొందరు ప్రయాణికులు వాటిని ఖాతరు చేయట్లేదు. ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పర్వీన్ బాబీ, శశి కపూర్ నటించిన ‘సుహాగ్’ సినిమాలోని ‘మెయిన్ తో బేఘర్ హూన్’ పాటకు ఇద్దరు యువతులు కోచ్ లోపల ఉన్న స్తంభాలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. @HasnaZarooriHai అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఢిల్లీ మెట్రోలో పోర్న్, ముద్దులు, గొడవల తర్వాత..తాజాగా ‘పోల్ డ్యాన్స్’….అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఢిల్లీ మెట్రోలో అధికారుల పర్యవేక్షణ అవసరం, రీల్ చేసేవారికి ఇది కొత్త లొకేషన్‌లా ఉంది’ అని ఒకరు.. ‘DMRC అధికారులు ఇలాంటి వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? వీరు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవలను కించపరిచారు’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. ఈ వీడియో చూసి.. నెటిజన్ల కామెంట్లు చూసి DMRC ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
After porn, kissing and fighting in Delhi Metro,
The latest is Pole Dancing…..
????? pic.twitter.com/RpvKJ9jLny— Hasna Zaroori Hai ?? (@HasnaZarooriHai) July 6, 2023
