Teacher Married Student : అతడికి 50, ఆమెకి 20.. తన స్టూడెంట్‌‌నే పెళ్లాడిన టీచర్, వీడియో వైరల్

ఆయన ఓ టీచర్. వయసు 50ఏళ్లు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్.. సభ్య సమాజం విస్తుపోయే పని చేసింది. తన దగ్గర కోచింగ్ కోసం వచ్చే స్టూడెంట్ నే ఆ టీచర్ పెళ్లాడాడు.

Teacher Married Student : అతడికి 50, ఆమెకి 20.. తన స్టూడెంట్‌‌నే పెళ్లాడిన టీచర్, వీడియో వైరల్

Updated On : July 13, 2023 / 1:21 PM IST

Teacher Married Student : ఆయన ఓ టీచర్. వయసు 50ఏళ్లు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్.. సభ్య సమాజం విస్తుపోయే పని చేశాడు. తన దగ్గర కోచింగ్ కోసం వచ్చే స్టూడెంట్ నే ఆ టీచర్ పెళ్లాడాడు. ఇద్దరి మధ్య 30ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా లెక్క చేయలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ విచిత్ర ఘటన బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆ యువతి పేరు శ్వేతా కుమారి(20), ఆ టీచర్ పేరు సంగీత్ కుమార్(50). రోస్రా వాసి శ్వేతా కుమారి.. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు టీచర్ దగ్గరికి వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ లవ్ లో పడ్డారు. మనసులు దగ్గరయ్యాయి. ఈ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే.. పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.

Also Read..Tuition teacher marries student : 13ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకున్న ట్యూషన్ టీచర్, కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అంతే, ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. రోస్రా బజార్ లోని ఓ గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వయసులో తన కన్నా 30 ఏళ్లు పెద్ద వాడని తెలిసినా.. ఆ విద్యార్థిని సంశయించలేదు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ… టీచర్ తో ఆ స్టూడెంట్ మూడు ముళ్లు వేయించుకుంది.

ఈ పెళ్లికి కొంతమంది సన్నిహితులు కూడా అటెండ్ అయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీచర్, స్టూడెంట్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. అంతా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. హవ్వ.. అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Also Read..Kolkata : కీచక టీచర్-ప్రైవేట్ క్లాస్ పేరుతో విద్యార్ధినిపై లైంగిక దాడి

ఇంగ్లీష్ టీచర్ సంగీత్ కుమార్ భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన ఇంటికి సమీపంలోనే శ్వేతా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు సంగీత్ కుమార్ దగ్గరికి వచ్చేది. ఈ క్రమంలో ఆయనతో లవ్ లో పడింది. ఏజ్ లో తనకన్నా 30ఏళ్లు పెద్ద అని తెలిసినా.. అతడితో లవ్ లో పడింది శ్వేత. ఈ విషయం తెలిశాక.. టీచర్ కూడా తన విద్యార్థినితో లవ్ లో పడ్డాడు. అలా ఇద్దరి మనసులు కలిశాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇలా ఒక్కటయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.