Viral Video : పంతులు గారు కాస్త అర్థ‌మ‌య్యేలా చెప్పాలి క‌దా.. పాపం పెళ్లి కూతురు క‌న్‌ఫ్యూజ్ అయిందిగా..!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

Viral Video Bride confused and hold the hand of priest

ఒక‌ప్పుడు పెళ్లిళ్లు అంటే ఐదారు రోజుల ముందుగానే బంధువులు, స్నేహితులు పెళ్లింటికి వెళ్లి సాయం చేసేవారు. దీంతో వారికి అన్ని విష‌యాల‌పైనా అవగాహ‌న ఉండేది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ప్ర‌స్తుతం ఈ బిజీ యుగంలో పెళ్లి ముహూర్తానికి వెళ్లామా, ఇంత తిన్నామా అన్న‌ట్లుగా ఉంది. దీంతో ఆచార సాంప్ర‌దాయాల‌కు సంబంధించిన అవ‌గాహ‌న చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇక పురోహితులు సంద‌ర్భానుసారంగా ఆచారాల గురించి స‌రిగా అవ‌గాహ‌న లేని వ‌ధూవ‌రుల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేస్తుండాన్ని చూస్తూనే ఉంటాం..

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో వ‌రుడి చేయి ప‌ట్టుకోవాల‌ని పెళ్లి కూతురుకి పంతులు సూచించ‌గా ఆమె మాత్రం పంతులు చేయి ప‌ట్టుకుంది. జ‌య‌గోగ‌డెక‌రేష‌న్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పంతులు.. వ‌ధూవ‌రులు ఒక‌రి చేయి మ‌రొక‌రు ప‌ట్టుకోవాల‌ని సూచించ‌గా వ‌ధువుకు అర్థం కాక‌.. పంతులు చేయి ప‌ట్టుకుంది.

August Long Weekend : ఆగస్టులో లాంగ్ వీకెండ్ ప్లాన్స్.. ఆఫీసులో పని తప్పించుకోవడానికి ఉద్యోగుల తంటాలు.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్..!

దాంతో పంతులు న‌వ్వుతూ.. నా చేయి కాదు.. వ‌రుడి చేయి అన్న‌ట్లుగా సైగ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘పంతులు గారు ముందే చెప్పాలి గ‌దా.. పాపం పెళ్లి కూతురు క‌న్‌ప్యూజ్ అయింద‌ని.’ ఒక‌రు అన‌గా ‘అందుక‌నే చెప్పేది.. పెళ్ల‌ళ్ల‌కు తాళి క‌ట్టే టైంకి వెళ్ల‌కుండా కాస్త ముందుగానే వెళితే ఇలాంటివి అన్ని తెలుస్తాయ్ అనేది.’ అంటూ మ‌రొక‌రు కామెంట్ చేశారు

ట్రెండింగ్ వార్తలు