Viral Video: మెట్రో రైల్‌లో తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన యువకుడు
ఇద్దరూ దెబ్బలాడుకోకుండా మరో ప్రయాణికుడు కలుగజేసుకుని..
- T Venkateshwarlu
- Published On : July 31, 2024 / 10:00 PM IST
ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణికులు రీల్స్ తీసుకుంటూ పదే పదే వార్తల్లో నిలుస్తుంటారు. అలా చేయకూడదని అధికారులు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా రీల్స్ తీసుకుంటూ తోటి ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తుంటారు.
ఢిల్లీ మెట్రో రైలు జరిగిన మరో ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సారి రీల్స్ తీసుకున్నందుకు కాదు. ఇద్దరు ప్రయాణికులు మెట్రో రైల్ లోనే గొడవపడ్డారు. ఓ ప్రయాణికుడిని చెప్పుతో కొట్టాడు మరో ప్రయాణికుడు. దీంతో తనను కొట్టిన వ్యక్తిని ఒకటికి రెండు సార్లు కొట్టాడు రెండో వ్యక్తి.
ఆ తర్వాత ఇద్దరూ దెబ్బలాడుకోకుండా మరో ప్రయాణికుడు కలుగజేసుకుని వారి గొడవను ఆపాడు. ఢిల్లీ మెట్రో రైలులో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చెప్పుతో కొట్టిన వ్యక్తి మద్యం తాగి అలా ప్రవర్తించినట్లున్నాడంటూ మరో వ్యక్తి అన్నాడు. మెట్రోలో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చని అందరూ భావిస్తుంటే కొందరు వాటిల్లో చేస్తున్న పిచ్చి పనుల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Kalesh b/w Two Guys inside Delhi Metro
pic.twitter.com/uIll8KqCWk— Ghar Ke Kalesh (@gharkekalesh) July 30, 2024
Also Read: ఇలా చేశావ్ ఏంటి? ఆఫీసు మీటింగులో డ్యాన్స్ చేసిన ఉద్యోగిని
