Viral Video: ఖాళీగా ఉన్న బస్సులోనూ సీటు కోసం కొట్టుకున్న మహిళలు
భూదేవికి ఉన్నంత ఓర్పు మహిళలకు ఉంటుంది. కానీ, బస్సు ఎక్కిన సమయంలో మాత్రం ఆ ఓర్పును కోల్పోతున్నారు మహిళలు.
- T Venkateshwarlu
- Published On : February 23, 2024 / 02:24 PM IST
Viral Video
భారత్‌లో ప్రజా రవాణా వాహనాలను ప్రజలు బాగా వాడుకుంటారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు చేసే ఫైటింగ్‌కు సంబంధించిన వీడియోలు తరుచూ వైరల్ అవుతుంటాయి. సీట్ల కోసం మహిళలు బస్సుల్లో చేసే పోరాటాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
వారిలోని బలం మొత్తాన్ని కూడగట్టుకుని వారు చేసే ఫైటింగ్ సినిమాల్లో హీరోలు చేసే ఫైటింగ్‌ను తలపిస్తుంటాయి. తాజాగా, ఇటువంటి మరో వీడియో ఆన్‌లైన్‌లో దర్శనమిస్తోంది. ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవపడ్డారు. ఆ సమయంలో ఒకరు వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తెగ వైరల్ అవుతోంది. మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇందులో ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే ఆ బస్సులో అనేక సీట్లు ఖాళీగానే ఉన్నాయి. అయినప్పటికీ కుడి వైపున ఉండే సీటు కోసం ఆ మహిళలు గొడవ పడినట్లు తెలుస్తోంది.
బస్సు ఖాళీగా ఉన్నా, నిండుగా ఉన్నా ఫైటింగ్ మాత్రం తప్పనిసరి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంట్లో ప్రాక్టీస్ చేసే ఫైటింగ్ ను ప్రదర్శించడం కోసమే కొందరు బస్సు ఎక్కుతున్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
महिलाएं कुछ ज्यादा ही शशक्त हो गयी हैँ अब, अब उन्हें बदतमीजी और लड़ाई करने के लिए भी किसी के सहारे की जरुरत नहीं है, अब हम खुद एक दूसरे का बाल खिंच सकती हैँ, एक दूसरे को गाली दे सकती हैँ ? pic.twitter.com/e099RHUFar
— Shalini kumawat ( हिन्द की नारी ) (@ShaliniKumawat0) February 22, 2024
