Tamilnadu Vk. Sasikala Sasikala Name Change
VK Sasikala: తమిళనాడు మాజీ సీఎంలు కే పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వంలతో సహా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కఝగం పార్టీ లీడర్‌షిప్ మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగానూ చెన్నై, తిరువల్లూరు, తిరుత్తనిలలో పబ్లిక్ సపోర్ట్ కోసం మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో తమిళనాడు గడ్డ, మహిళల హక్కుల గురించి నినదించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని టీ నగర్ లోని తన నివాసం నుంచి ప్రారంభించనున్నారు శశికళ. జే జయలలిత చేసిన యాత్రలను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. రోడ్ షోలో భాగంగా పలు పాయింట్లలోని పబ్లిక్ క్యాడర్ ను కలవనున్నారు.
“పార్టీ నెలకొల్పినప్పుడు ఎంజీ రాంచంద్రన్ మాట్లాడుతూ ఈ పార్టీ పేదలు, సాధారణమైన ప్రజల అభ్యున్నతి కోసం పెట్టింది. కులం, మతం లాంటివేమీ పట్టించుకోని పార్టీ ఇది. పేదల సంక్షేమం కోసం చూసే పార్టీ కాబట్టే జయలలిత అదే చేశారు” అని శశికళ అన్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత కాబట్టే ఈ ప్రయాణం మొదలుపెట్టానని అంటున్నారు.
Read Also : ఏమీ కలిసి రావటంలేదట..అందుకే..పేరు మార్చుకోనున్న శశికళ..
పార్టీలో అంతర్గత పోరు గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నాకు సంబంధించినంత వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజానీకం నా వెంటే ఉన్నారని, అందుకే పేదలు, సామాన్యులకు అండగా ఉండే అన్నాడీఎంకే పాలనను త్వరలోనే తీసుకొస్తా. పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవల వల్ల పార్టీ మొత్తం కష్టాల్లో కూరుకుపోయిందని అనుకోలేం’ అని వ్యాఖ్యానించారు.