ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఓ భారీ మొసలిని భుజాలపై మోసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 20 అడుగుల పొడవు, 150 కిలోల బరువున్న మొసలిని ఆ యువకుడు మోసుకెళ్లడం గమనార్హం.
హమీర్‌పూర్ జిల్లా పరిధిలోని పౌతియాఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం చెరువులో మొసలి కనిపించడంతో నీటి కోసం అక్కడకు వెళ్లడానికే గ్రామస్థులు భయపడుతున్నారు. స్థానికులు అటవీ శాఖకు ఫిర్యాదు చేయడంతో దాన్ని పట్టుకోవడానికి సిబ్బంది వచ్చారు.
ఆ మొసలిని సిబ్బంది పట్టుకున్నారు. అందులోని ఓ యువకుడు ఇలా చివరకు దాన్ని భుజాలపై మోసుకెళ్లాడు. ఆ సమయంలో కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. మొసలిని తన భుజాలపై మోసుకెళ్లే ముందు అటవీ శాఖ అధికారి దాని నోరు, అవయవాలను గుడ్డ, తాడుతో కట్టేశారు. మొసలిని రక్షించిన తర్వాత దానిని అరణ్యంలోకి వదిలారు.
मगरमच्छ को कंधे पर लादकर ले जाते युवक का वीडियो सोशल मीडिया पर तेजी से हो वायरल !!
बीते तीन हफ्ते से गांव में दहशत फैलाए था विशालकाय मगरमच्छ !!
तीन हफ्ते की कड़ी निगरानी के बाद वनविभाग की टीम और एक्सपर्ट लोगों ने मगरमच्छ को पकड़ा !!
हमीरपुर का वायरल वीडियो !!#ViralVideo… pic.twitter.com/jKT6eJxUjX— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) November 26, 2024
Vladimir Putin: ‘ట్రంప్ ఇప్పుడు సురక్షితంగా లేరు’ అంటూ పుతిన్ కామెంట్స్