West Bengal Election Results 2026 Live: బెంగాల్లో బీజేపీ డబుల్ సెంచరీ.. ‘ఇది చాలా కాలాం గుర్తుంటుంది’ అంటూ మోదీ ట్వీట్
West Bengal Elections Results 2026 Live : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక స్థానంలో ఈనెల 21న రీపోలింగ్ నిర్వహిచబోతున్నారు.
- Harish Thanniru
- Updated on- May 4, 2026 / 06:48 PM IST
West Bengal Election Results 2026 Live
West Bengal Elections Results 2026 Live : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ‘కమలం వికసించింది. ఇది చాలా కాలం గుర్తుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.
బెంగాల్లో బీజేపీ డబుల్ సెంచరీ కొట్టింది. 293 సీట్లకు గాను 208 సీట్లలో మెజారిటీలో ఉంది. టీఎంసీ కేవలం 79 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్ కు పరుగులు పెట్టారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి 12వ రౌండ్ ఫలితాలను ఎన్నికల కమిషన్ చాలా సేపటి వరకు అప్ డేట్ చేయకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. దీంతో దీదీ వెంటనే భవానీపూర్ కు కౌంటింగ్ సెంటర్ కు వెళ్లారు. అదే సమయంలో సువేందు కూడా కౌంటింగ్ సెంటర్ కు వెళ్లారు.
పశ్చిమ బెంగాల్లో ఓడిపోయిన మమతా బెనర్జీ పార్టీకి తన సానుభూతి తెలిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026
టీఎంసీ కార్యకర్తలకు మమత సందేశం.
‘పార్టీ ఏజెంట్ ఎవరూ పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లొద్దు. కేవలం 13శాతం ఓట్లే కౌంట్ అయ్యాయి. బీజేపీ లీడ్ లో ఉందనేది కేవలం బీజేపీ ప్రచారం. చివరి ఓటు కౌంట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. కళ్యాణ్ నియోజకవర్గంలో ఈవీఎం మెషిన్లలో లోపాలు మనం పట్టుకున్నాం. ’ అని పిలుపునిచ్చారు.
కేంద్ర బలగాల సాయంతో బీజేపీ.. టీఎంసీ కార్యకర్తల మీద దాడులు చేస్తోందని ఆరోపించారు. అలాగే, టీఎంసీ కార్యాలయాల మీద బీజేపీ దాడులు చేస్తోందన్నారు. ఓట్ చోరీ చేయడానికే SIR తెచ్చారని మమత ఆరోపించారు. ప్రస్తుతం ప్రకటించిన వాటి కంటే మరో 70 నుంచి 100 స్థానాల్లో టీఎంసీ లీడింగ్ లో ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన వివరాలు ఈసీ వెల్లడించడం లేదని మమత ఆరోపించారు.
భవానీపూర్ లో 12000 ఓట్ల ఆధిక్యంలో మమత.
సిలిగుడి, జల్పాయి గుడి, డార్జిలింగ్ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ
भगवामय भारत 🚩#WestBengal pic.twitter.com/6O4q9uDHAx
— 𝙸𝙽𝚂 𝚅𝙸𝚁𝙰𝚃 🐐 (@RINKUSINGH42465) May 4, 2026
మమత ఇంటి వద్ద బీజేపీ కోలాహలం. జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలు.
ఎన్నికల ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ మీద టీఎంసీ అసంతృప్తి. చాలా ఆలస్యంగా అప్ డేట్ చేస్తున్నారని ఆగ్రహం.
భవానీపూర్ లో ఆధిక్యంలో మమతా బెనర్జీ. తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి మీద 25 వేల ఓట్లకు పైగా మెజారిటీలో కొనసాగుతున్నారు.
అంతిమ విజయం మాదే అంటున్న టీఎంసీ నేతలు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తున్నా.. టీఎంసీ వెనుకబడి ఉన్నా కూడా కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి తామే గెలుస్తామని దీమాలో ఉన్నారు.
బెంగాల్లో CASF బలగాల కొనసాగింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మరికొన్ని రోజులపాటు బలగాలను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్ ను 11వ తేదీన విచారిస్తామని చెప్పింది.
బెంగాల్లో బీజేపీ సునామీ సృష్టించడం వెనుక ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని బయటపెట్టారు ఆ పార్టీ నేత సువేందు అధికారి. హిందూ ఓట్ల ఏకీకరణ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇది ముస్లింలకు పెద్ద దెబ్బ అన్నారు.
బెంగాల్లో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలోకి రావడంతో బెంగాల్లో బీజేపీ కేడర్ సంబరాలు చేస్తోంది. బీజేపీ ఆఫీసులో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ, టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
బెంగాల్లో వస్తున్న తొలి ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ దాటింది.
భవానీపూర్ లో పోరు రసవత్తరంగా మారింది. కొద్దిసేపటి వరకు మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉండగా, ఇప్పుడు సువేందు లీడ్ లోకి వచ్చారు. దీంతో పోరు టగ్ ఆఫ్ వార్ గా మారింది. 2021 ఎన్నికల్లో మమత బెనర్జీ మీద సువేందు అధికారి నందిగ్రామ్ లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ సారి కూడా అలాంటి సంచలనం నమోదువుతుందా?
భవానీ పూర్ నియోజకవర్గంలో పోటా పోటీ నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో హోరాహోరీ కొనసాగుతోంది. బీజేపీ, టీఎంసీ పోటాపోటీగా ఉన్నాయి.
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక స్థానంలో ఈనెల 21న రీపోలింగ్ నిర్వహిచబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపుకోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది.
రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 92.47శాతం ఓటింగ్ నమోదైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. అయితే, ఈ భారీ ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
