West bengal BJP Government : మొదటిసారి గెలవగానే బెంగాల్ మహిళకు బీజేపీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్..
West Bengal BJP Government : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి కేబినెట్ లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- Harish Thanniru
- Updated on- May 12, 2026 / 07:53 AM IST
West Bengal BJP Government
- పశ్చిమబెంగాల్‌లోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం
- సీఎం సువేందు అధికారి నేతృత్వంలో కేబినెట్ భేటీ
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన
West bengal BJP Government : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఆ రాష్ట్రంలో మొదటి సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బెంగాల్ సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షాతోపాటు.. ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే, తాజాగా.. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
సీఎం సువేందు అధికారి నేతృత్వంలో సోమవారం తొలిసారి కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చర్చించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంలో తమ రాష్ట్రాన్ని చేరుస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ లను రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకొచ్చేలా నిర్ణయించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు అవసరమైన భూభాగాన్ని సరిహద్దు భద్రతా దళానికి బదిలీ చేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి కేబినెట్ లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మంది మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ప్రయోజనం పొందుతారని అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. తాజాగా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు బీజేపీ సర్కార్ నిర్ణయించింది.
