west bengal politics : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆస్తులెంతో తెలుసా? మమత బెనర్జీతో పోల్చితే.. ఆశ్చర్యపోవాల్సిందే..

west bengal politics : సువెందు అధికారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ ఎంత..? మాజీ సీఎం మమతా బెనర్జీ ఆస్తుల విలువ ఎంత..? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 2026 ఎన్నికల సమయంలో వారు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తే..

mamata banerjee, Suvendu adhikari

  • పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి
  • ఆయన ఆస్తుల విలువపై కొనసాగుతున్న చర్చ
  • మమతా బెనర్జీ కంటే ఎక్కువా..? తక్కువా?

west bengal politics : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తొలిసారి బెంగాల్‌లో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బెంగాల్ సీఎంగా కొనసాగుతున్న మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అధికారంలోకి రావడంలో సువేందు అధికారి కీలక భూమిక పోషించారు. దీంతో బీజేపీ కేంద్ర అదిష్టానం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారికి అవకాశం కల్పించింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Also Read : Weather Updates : వాతావరణ శాఖ బిగ్ అప్డేట్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. దేశవ్యాప్తంగా జల్లులు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాలకు ఎంట్రీ అప్పుడే…

సువేందు అధికారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ ఎంత..? మాజీ సీఎం మమతా బెనర్జీ ఆస్తుల విలువ ఎంత..? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 2026 ఎన్నికల సమయంలో వారు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తే..

సువెందు అధికారి నికర విలువ..
బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువెందు అధికారి నికర ఆస్తి విలువ రూ.85.87లక్షలు. అతని చరాస్తులలో నగదు, బ్యాంకు ఖాతాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి ప్రభుత్వ పొదుపు ఖాతాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.20.72లక్షలు. 2024-25 ఐటీఆర్ ప్రకారం.. అతనికి ఎలాంటి అప్పులు లేకుండా రూ.17.38లక్షల వార్షిక ఆదాయం ఉంది. అతని స్థిరాస్తుల విలువ రూ.65.15లక్షలు. వీటిలో ప్రధానంగా పూర్వ మోదీనీపూర్‌లోని కర్కులి ప్రాంతంలో ఉన్న పూర్వీకుల భూమి, నివాస భవనాలు ఉన్నాయి.

మమతా బెనర్జీ నికర విలువ..
71ఏళ్ల మమతా బెనర్జీ చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంకు 15ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు ఇల్లు, కారు, మరే ఇతర చెప్పుకోదగ్గ ఆస్తి లేదు. ఆమె తన మొత్తం ఆస్తులు రూ.15.4లక్షలుగా చూపించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 40,600 టీడీఎస్ రీఫండ్‌ను ఆమె అఫిడవిట్‌లో ప్రకటించారు. రూ.75,700 నగదును చూపించగా.. బ్యాంక్ ఖాతాలో అధికం భాగం రూ.12,36,209.71 ఉంది. ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకోసం మరో బ్యాంక్ ఖాతాల్లో ఆమెకు రూ.40,000 ఉన్నట్లు చూపించారు. ఆమెకు బ్యాంకులో మొత్తం రూ. 12,76,209 డిపాజిట్లు ఉన్నాయి. విలువైన లోహాల విషయానికి వస్తే.. మమతా బెనర్జీ సుమారు రూ.1,45,000 విలువైన 9 గ్రాముల 750 మిల్లీగ్రాముల బంగారం కలిగి ఉన్నారు.. ఆమె చరాస్తుల విలువ రూ. 15,37,509.71గా చూపించారు. ఆమె తన అఫిడవిట్‌లో.. తనకు ఎలాంటి ప్రైవేట్ వాహనాలు, నివాస ఆస్తి, వ్యవసాయం, వ్యవసాయేతర భూమి లేదని పేర్కొన్నారు.