Bengal Polling 2021 : బెంగాల్‌లో పోలింగ్ ఏజెంట్ టోపీపై సీఎం మమత ఫోటో
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడో విడత పోలింగ్ జరుగుతున్న క్రమంలో అసన్‌సోల్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ పార్టీకి చెందిన ఓ ఏజెంట్ సీఎం మమతా బెనర్జీ ఫోటో ఉన్న క్యాప్ పెట్టుకుని తిరిగాడు. అతను చాలాసేపటి నుంచి అలా తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటం గమనించాల్సిన విషయం.
- nagamani
- Published On : April 26, 2021 / 03:00 PM IST
Bengal Polling 2021
Bengal Polling 2021: పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా ఏడవ దశ పోలింగ్ ఉదయం నుంచే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కలకలం చెలరేగింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడో విడత పోలింగ్ జరుగుతున్న క్రమంలో అసన్‌సోల్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ పార్టీకి చెందిన ఓ ఏజెంట్ సీఎం మమతా బెనర్జీ ఫోటో ఉన్న క్యాప్ పెట్టుకుని తిరిగాడు. అతను చాలాసేపటి నుంచి అలా తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటం గమనించాల్సిన విషయం. ఇది ఎన్నికల నియమావళినికి విరుద్ధం అనే విషయం అనే విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా సదరు ఏజెంట్ వ్యవహరించినా ఎన్నికల అధికారులు గుర్తించకపోవడం గమనించాల్సిన విషయం.కానీ ఈ విషయాన్ని టీఎంసీకి బద్ధ శతవు అయిన బీజేపీ పార్టీ అభ్యర్థి అగ్నిమిత్ర పౌల్ అనుచరులు గుర్తించారు. ఆ విషయాన్ని వెంటనే అగ్నిమిత్రకు తెలియజేశారు. దీంతో అగ్నిమిత్ర సదరు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
టోపీ ధరించిన ఏజెంట్‌ను పట్టుకుని..నిలదీశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినప్పటికీ ఏం చేస్తున్నారని ఎన్నికల సిబ్బందిని నిలదీశారు. తనకు అనారోగ్యంగా ఉండటంతో ఈ విషయాన్ని గుర్తించలేకపోయానని ప్రిసైడింగ్ అధికారి చెప్పడం గమనార్హం. అనంతరం ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకున్నారు.
WB: Agnimitra Paul, BJP candidate from Asansol Dakshin Assembly constituency in Paschim Bardhaman says that TMC polling agent was wearing a cap with CM's photo on it, at polling booth in Baktarnagar High School.
She says, "Presiding officer says that he's unwell & didn't see it" pic.twitter.com/bkhZtqvDjc
— ANI (@ANI) April 26, 2021
