పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ గత కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఎయిర్‌క్రాఫ్ట్ ఇరుక్కుపోయిన విషయాన్ని తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్‌కు చేరుకున్నారు.
బ్రిడ్జి కింద చిక్కుకుపోయిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను బయటకు తీసేందుకు పోలీసులు, అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం (డిసెంబర్ 23) రాత్రి ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బ్రిడ్జి కింద ఇరుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు.
West Bengal: A truck carrying an abandoned India Post aircraft has got stuck under a bridge in Durgapur. More details awaited. pic.twitter.com/jGXkOuTqHs
— ANI (@ANI) December 24, 2019