Wall competing : స్థలాలు కాదు గోడల్నే కబ్జా చేసేస్తున్న రాజకీయ పార్టీలు..నోరెత్తని యజమానులు

Aligarh Girl Rape

West bengle Elections 2021 Wall competing at night :  రాజకీయ నేతలు..కొంతమంది బడాబాబులు పెద్దల అండతో స్థలాలను కబ్జా చేయటం గురించి విన్నాం. కానీ గోడల్ని కబ్జా చేసిన వైనం గురించి విన్నారా? ఆ ఇల్లు..ఈ ఇల్లు అని కూడా చూడకుండా కనిపించిన గోడలన్నీ కబ్జా చేసేస్తున్నారు పశ్చిమబెంగాల్ లోని రాజకీయ నేతలు. గోడల్నేం చేసుకుంటారు? అనే డౌట్ వస్తుంది కదూ..ఎన్నికల రోజుల్లో గోడలే కదా..ప్రచార సాధనాలు..

అందుకే పశ్చిమబెంగాల్లో ఎన్నికల వేడి జోరందుకున్న వేళ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు..అన్ని పార్టీల రాజకీయ నేతలు కనిపించిన గోడలన్నీంటినీ కబ్జా చేసి వారి వారి పార్టీ ప్రచారసాధనాలుగా వాడేస్తున్నారు. ఇలా కనిపించిన గోడలన్నీ ఆయా పార్టీల ఎన్నికల ప్రచారాలుగా మారిపోతున్నాయి.

 

పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వాల్ క్యాంపెయినింగ్ ఊపందుకుంది. పెద్ద పెద్ద గోడలే కాదు..చిన్నపాటి గోడ కనిపిస్తే చాలు పార్టీ నినాదాలు రాసిపారేస్తున్నారు. కనీసం ఇంటి యజమాని పర్మిషన్ కూడా తీసుకోకుండా..అన్ని ఇళ్ల గోడల్ని..ప్రహరీ గోడల్ని వివిధ పార్టీల వారు యధేచ్ఛగా వాడేసుకంటున్నారు. ఈ వాడకాలు మామూలుగా లేదు. గోడలన్నీ ఆయా పార్టీల ప్రచారసాధనాలుగా మారిపోతున్నాయి.

సోషల్ మీడియా జమానాలోనూ రాష్ట్రంలో ఈవిధమైన వాల్ క్యాంపెయినింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటివరకూ వాల్ క్యాంపెయినింగ్‌లో టీఎంసీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ఇళ్ల గోడలను ఆక్రమించేసింది. అక్కడక్కడ బీజేపీ, సీపీఎంల వాల్ క్యాంపెయినింగ్ కనిపిస్తోంది. నిజానికి ఎవరి ఇంటి గోడపైన అయినా ప్రచార నినాదాలు రాయాలంటే సదరు ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలి. అయితే దీనిని విస్మరిస్తూ రాత్రి వేళల్లో గోడలపై పార్టీల ప్రచార నినాదాలు రాసేస్తున్నారు.

 

అలా తమ గోడల్ని నింపేస్తుంటే ఆయా ఇంటి యజమానులు ప్రశ్నించటానికి కూడా భయపడుతున్నారు. ఎక్కడ గొడవలు వస్తాయేమోనన్న భయంతో కొందరు తమ ఇంటి గోడపై ఎవరు ఏమి రాసినా నోరు మెదపడం లేదు. అలా చూస్తుండిపోతున్నారంటే..ఒక పార్టీ వారు ఏ గోడమీదన్నా రాసిన తరువాత మరో పార్టీ వారు ఆ గోడమీద వారి పార్టీలవి రాసే పరిస్తితి లేదు..ఒకవేళ అలా జరిగితే..గొడవలు మామూలుగా జరగవు..దీంతో ఇళ్ల యజమానులు మాత్రం ఏమీ అనకుండా..నోరెత్తకుండా ఎవరు ఏం రాసినా మిన్నకుండిపోతున్నారు.

కొన్ని గోడలపై అయితే..ఓ వైపున బీజేపీ..మరో వైపున టీఎంసీ పార్టీల వారు తమ రాతలు రాసేస్తున్నారు. సో..అదండీ రాజకీయ నేతల గోడల కబ్జా కథా కమామీషు..