TDR Filing: ట్రైన్ మిస్సైతే డబ్బులు వెనక్కి వస్తాయా? అదే టికెట్ తో వేరే ట్రైన్ లో జర్నీ చేయొచ్చా.. రైల్వే రూల్స్ ఇవే!

రిజర్వ్ చేసిన రైలు మిస్సయితే తిరిగి డబ్బులు(TDR Filing) పొందడానికి తగిన రైల్వే నిబంధనలు ఉన్నాయి.

What happens if you miss the train? TDR details and penalty information.

  • వేరే రైలు ఎక్కితే జరిమానా
  • టీడీఆర్‌తోనే టికెట్ రిఫండ్ లభ్యం
  • తదుపరి స్టేషన్‌లో అందుకోవడానికి అవకాశం

TDR Filing: రైలు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా అనివార్య కారణాల వల్ల రైలు మిస్సయితే, తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రయాణికుల్లో అనేక అనుమానాలు ఉంటాయి. మిస్సయిన రైలు టికెట్‌తో వేరే రైలు ఎక్కవచ్చా, ప్రయాణించని టికెట్‌కు డబ్బులు వెనక్కి వస్తాయా, టిడిఆర్ (TDR Filing) ఎలా దాఖలు చేయాలి అనే అంశాలపై ఇండియన్ రైల్వేస్‌కు నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. బుక్ చేసుకున్న సర్వీస్‌ను కోల్పోయినప్పుడు చట్టబద్ధమైన హక్కులు, రైల్వే నిబంధనలు తెలుసుకోవడం ప్రయాణికులకు ఎంతో అవసరం.

Chandrababu: ఎల్ నినో ప్రభావం ప్రజలపై పడకూడదు.. ధరలు పెరగకూడదు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

వేరే రైలు ఎక్కవచ్చా? జరిమానాలు, టీటీఈ రూల్స్:

రిజర్వ్ చేసిన రైలు మిస్సయితే అదే టికెట్‌తో మరొక రైలులో ప్రయాణించడం రైల్వే నిబంధనలకు విరుద్ధం. అలా ప్రయాణిస్తే టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి టీటీఈ (TTE) అదనపు ఛార్జీలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అయితే సాధారణ జనరల్ టికెట్లకు కొంత సడలింపు ఉంటుంది. ఒకవేళ మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు మిస్సయినా, టీటీఈ వెంటనే మీ బెర్త్‌ను ఇతరులకు కేటాయించరు. తదుపరి రాబోయే కొద్ది స్టేషన్ల వరకు అదే రైలును అందుకోవడానికి ప్రయాణికుడికి అవకాశం ఉంటుంది.

రిఫండ్ ప్రక్రియ, టీడీఆర్, దాఖలు చేసే విధానం:

రైలు మిస్సయినంత మాత్రాన ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతాలో జమకావు. రైల్వే నిబంధనల ప్రకారం నిర్దిష్ట గడువులోగా ‘టికెట్ డిపాజిట్ రిసీప్ట్’ దాఖలు చేస్తేనే రిఫండ్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణం విరమించుకుంటే పూర్తి రిఫండ్ లభిస్తుంది. సరైన సమయంలో టీడీఆర్ సమర్పించకపోతే ఎలాంటి రిఫండ్ రాదని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. కాబట్టి, మీరు ఏదైనా కారణాల వల్ల రైలు మిస్ అయినప్పుడు తదుపరి స్టేషన్ లో అదే రైలులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. లేదా, నిర్దిష్టమైన సమయంలోగా టీడీఆర్ దరఖాస్తు చేసుకోవడం వల్ల మీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.