Gen Z Graveyard Dating : గ్రేవ్‌యార్డ్ డేటింగ్ అంటే ఏమిటి? యువతను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్
Graveyard Dating : కొందరు యువ జంటలు సంప్రదాయ డేట్ ప్రదేశాలకు బదులుగా స్మశాన వాటికలు, సమాధుల ప్రాంగణాల్లో సమయం గడుపుతున్నారు.
- Harish Thanniru
- Updated on- June 19, 2026 / 12:08 PM IST
Gen Z Couples Graveyard Dating
Graveyard Dating : ప్రేమ జంటలు డేట్‌కు వెళ్తే కేఫ్‌లు, మాల్స్, రెస్టారెంట్లకు గుర్తుకొస్తాయి. అయితే, ఇప్పుడు ఇది పాత విషయం.. ప్రస్తుతం జెన్ జీ (Gen Z) యువత ట్రెండ్ మార్చింది. దీంతో గ్రేవ్‌యార్డ్ డేటింగ్ అనే కొత్తట్రెండ్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో యువ జంటలు సంప్రదాయ డేట్ ప్రదేశాలకు బదులుగా స్మశాన వాటికలు, సమాధుల ప్రాంగణాల్లో సమయం గడుపుతున్నారు.
సాధారణంగా ఈ డేటింగ్‌లో జంటలు కలిసి నడవడం, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం, జీవితంపై ఆలోచనలు పంచుకోవడం వంటి పనులు చేస్తారు. అయితే, జెన్ జీ యువత శ్మశాన వాటికలో డేటింగ్ అనే కొత్త ట్రెడ్‌ను పాటిస్తున్నారు. ఈ ట్రెండ్‌కు మద్దతు ఇచ్చేవారు.. ప్రశాంత వాతావరణంలో ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు మంచి ప్రదేశమని చెబుతున్నారు.
శ్మశాసన వాటికలను డేటింగ్ ప్రదేశాలుగా ఎంచుకోవడం వల్ల ప్రశాంతమైన వాతావరణం, తక్కువ అంతరాయాలు, డబ్బు ఖర్చు చేయాల్సిన ఒత్తిడి లేకపోవటం, లోతైన సంభాషణలకు అవకాశం ఉండటం, వాణిజ్యపరమైన డేటింగ్ సంస్కృతికి భిన్నమైన అనుభూతిని పొందటం వంటి కారణాలను చెబుతున్నారు. ప్రస్తుతం డేటింగ్ యాప్‌లు, రద్దీగా ఉండే కేఫ్‌లు, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ కాలంలో కొందరు యువతకు ఇది ఒకరినొకరి మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి మంచి మార్గమని చెబుతున్నారు.
Also Read – Telegram Banned in India : ఇండియాలో టెలిగ్రామ్ బంద్? కారణాలివే.. కేంద్రం చెప్పింది వింటే షాక్ అవుతారు!
అయితే ఈ ట్రెండ్‌పై విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. స్మశానవాటికలు దుఃఖం, జ్ఞాపకాలు, నివాళులకోసం ఉద్దేశించిన ప్రదేశాలు. కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారిని స్మరించుకునేందుకు అక్కడికి వస్తారు. అలాంటి ప్రదేశాలను రొమాంటిక్ డేట్ స్పాట్‌లుగా ఉపయోగించడం కొందరికి అసభ్యంగా చెబుతున్నారు. గౌరవం లేని చర్యగా అనిపించవచ్చని వారు అంటున్నారు. ఈ చర్చ కేవలం డేటింగ్ గురించే కాకుండా, ప్రజా స్మారక ప్రదేశాలకు భావోద్వేగ పరిమితులు ఉండాలా అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది.
ఇదిలాఉంటే.. ఈ కొత్త ట్రెండ్ ప్రస్తుతం జెన్ జీ యువత ఆలోచనా విధానంలో వస్తున్న మార్పును ప్రతిబింబిస్తోంది. ఖరీదైన అవుటింగ్స్, సోషల్ మీడియా ఒత్తిడి, పైపై సంభాషణలతో విసిగిపోయిన కొందరు యువత ప్రశాంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, భావోద్వేగపరంగా నిజమైన అనుబంధాలను కోరుకుంటున్నారు. అయితే, గ్రేవ్‌యార్డ్ డేటింగ్ ప్రస్తుతం భారీ ఆదరణ పొందకపోయినా.. నేటి యువతలో కొందరు సంబంధాల్లో నిజాయితీ, లోతైన సంభాషణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని ఈ ట్రెండ్ స్పష్టంగా చూపిస్తోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
