WhatsApp Username: ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసులపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్
WhatsApp Username: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకువచ్చిన 'యూజర్ నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
- V Santhosh Kumar
- Updated on- July 2, 2026 / 11:58 AM IST
WhatsApp Username feature clarifies notices issued by Centre
- వాట్సాప్ కొత్త ఫీచర్‌పై వివాదం
- కేంద్రం నోటీసులకు సంస్థ వివరణ
- ఫోన్ నెంబర్ వాడకం తప్పనిసరి
WhatsApp Username: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకువచ్చిన ‘యూజర్ నేమ్’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త ఫీచర్ వల్ల తలెత్తే భద్రతా పరమైన సమస్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర సర్కార్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో, కేంద్రం వ్యక్తంచేసిన అభ్యంతరాలపై వాట్సాప్ స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చింది.
*Ration Rice Quality: పేద ప్రజలకు తీపి కబురు.. రేషన్ బియ్యం క్వాలిటీ పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం
ఈ ఫీచర్‌ను తాము ఇంకా అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేయలేదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగదారులు తమకు నచ్చిన ఐడీలను ముందస్తుగా ఎంచుకునే (రిజర్వ్ చేసుకునే) ఆప్షన్‌ను మాత్రమే కల్పించామని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సెలబ్రిటీల పేర్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, వారి ఐడీలను ఇప్పటికే ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచామని వెల్లడించింది.
యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాట్సాప్(WhatsApp) అకౌంట్ క్రియేట్ చేయడానికి మరియు వాడటానికి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అవసరమని సంస్థ తేల్చి చెప్పింది. ఈ కొత్త మార్పు వల్ల వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని, యూజర్ల డేటా రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని వాట్సాప్ యాజమాన్యం భరోసా ఇచ్చింది.
