×
Ad

Aviva Baig: ప్రియాంకా గాంధీ కాబోయే కోడలు బయోడేటా ఇదే

అవివా బేగ్ 3 రోజుల క్రితం రైహాన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

Aviva Baig Representative Image (Image Credit To Original Source)

  • అవివా బేగ్ జర్నలిజం చదివారు
  • పాపులర్ మ్యాగజైన్లలో పని చేశారు
  • ది జర్నల్ కు ఎడిటర్-ఇన్-చీఫ్

Aviva Baig: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్ మెంట్ వార్తలతో అవివా బేగ్‌ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈ జంట 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అవివా బేగ్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఈ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని సమాచారం. అవివా బేగ్ 3 రోజుల క్రితం రైహాన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. దాన్ని ఇప్పుడు ఆమె 3 హార్ట్ ఎమోజీలతో పాటు ‘హైలైట్స్’ సెక్షన్ లో ఉంచింది. కాగా, ఎవరీ అవివా బేగ్, ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ చదువుకుంది, ఎక్కడ ఉంటుంది, ఆమె పేరెంట్స్ ఎవరు, ఆమె బయోడేటా ఏంటి, బ్యాగ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

అవివా బేగ్ గురించి ఆసక్తికర విషయాలు..

అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం కమ్యూనికేషన్ చదివింది. ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో హ్యుమానిటీస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆమె భారతదేశం అంతటా ఏజెన్సీలు, బ్రాండ్‌లు, క్లయింట్‌లతో పనిచేసే ఫోటోగ్రాఫిక్ స్టూడియో, నిర్మాణ సంస్థ అయిన అటెలియర్ 11 అనే ఫోటోగ్రఫీ స్టూడియోకి సహ వ్యవస్థాపకురాలు (కో ఫౌండర్). సామాన్య ప్రజల జీవనశైలిని తన కెమెరాలో బంధించడంలో ఆమెది ప్రత్యేక శైలి. పలు ఆర్ట్ గ్యాలరీలలో తన ఫోటోలను ప్రద్శించారు. వెర్వ్ వంటి పాపులర్ మ్యాగజైన్లలో కూడా పని చేశారు.

మెథడ్ గ్యాలరీతో కలిసి ‘యు కెనాట్ మిస్ దిస్’ (2023), ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘యు కెనాట్ మిస్ దిస్’ (2023), ది కోరమ్ క్లబ్‌లో ‘ది ఇల్యూజరీ వరల్డ్’ (2019), ఇండియా డిజైన్ ఐడి, కే2 ఇండియా (2018) వంటి ప్రదర్శనలలో తన ఫోటోలను ప్రదర్శించారు.

అవివా మీడియా కమ్యూనికేషన్ రంగాలలో వివిధ పాత్రలలో పని చేశారు. ప్లస్‌రిమ్న్‌లో ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ప్రోపగాండాలో జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సేవలందించారు. ఆర్ట్ చైన్ ఇండియాలో మార్కెటింగ్ ఇంటర్న్‌గా పని చేశారు. ఐ-పార్లమెంట్‌లోని ‘ది జర్నల్’కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. వెర్వ్ మ్యాగజైన్ ఇండియా, క్రియేటివ్ ఇమేజ్ మ్యాగజైన్‌లో కూడా ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేశారు.

Aviva Baig Representative Image (Image Credit To Original Source)

ఎవరీ రైహాన్ వాద్రా?

ఇక, ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా విషయానికి వస్తే.. ఆయనొక ఒక విజువల్ ఆర్టిస్ట్. పదేళ్ల నుంచి ఫోటోగ్రఫీని అభ్యసిస్తున్నారు. ఆయన పోర్ట్‌ఫోలియోలో వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫోటోగ్రఫీ ఉన్నాయి. ఆయన మొదటి సోలో ఎగ్జిబిషన్ న్యూఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో జరిగింది. స్కూల్ క్రికెట్ మ్యాచ్ సమయంలో రైహాన్ వాద్రా ఎదుర్కొన్న కంటి గాయం నుండి ఇది ప్రేరణ పొందింది. ప్రమాదం తర్వాత ఆయన లోతును సృష్టించడానికి నీడ , కాంట్రాస్ట్‌ను ఉపయోగించి నలుపు-తెలుపు ఫోటోగ్రఫీ వైపు ఆకర్షితుడయ్యారు.

తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో, రైహాన్ తన తాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఫోటోగ్రఫీ నుండి ప్రేరణ పొందుతూ తన కళను అభివృద్ధి చేసుకుంటున్నారు.

Also Read: సర్‌ప్రైజ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ అవీవాతో ప్రియాంకా గాంధీ కుమారుడు రెహాన్‌ వాద్రాకు నిశ్చితార్థం