Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు..ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఈక్రమంలోనే మాలు పై ఒక ఏనుగు దాడి చేసి..తొక్కి చంపింది
- Bharath Reddy
- Published On : May 28, 2022 / 04:06 PM IST
Elephant
Wild elephant kills Woman: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన ఓ మహిళను ఏనుగు తొక్కి చంపిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నీలగిరి జిల్లా గుడలూరు సమీపంలోని ఓవలీ ఫార్మ్ కు చెందిన మాలు(40) అనే మహిళ శనివారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు..ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఈక్రమంలోనే మాలు పై ఒక ఏనుగు దాడి చేసి..తొక్కి చంపింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు..అక్కడికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Other stories: Wild Elephant: ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. ఏనుగు చేసిన పనికి తండ్రి, కూతురు మృతి
కాగా, రెండు రోజుల క్రితం(మే 26న) గుడలూరు సమీపంలోని మరో గ్రామం అరుట్టుపరైలోనూ..తెల్లవారుజామున టీ షాప్ తెరిచేందుకు వచ్చిన ఆనందన్ అనే వ్యక్తిని ఏనుగు తొక్కి చంపింది. వరుస ఘటనలతో బెంబేలెత్తిన గ్రామస్తులు..శనివారం నిరసనకు దిగారు. గత కొన్ని రోజులుగా ఐదు భారీ ఏనుగులు తమ గ్రామాల చుట్టూ తిరుగుతున్నాయని, పలుమార్లు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏనుగులను దారి మళ్లించలేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక మధుమలై టైగర్ రిజర్వు ప్రాంతం నుంచి రెండు ఆడ ఏనుగులను తెప్పించిన అటవీశాఖ అధికారులు..గ్రామాల నుంచి ఏనుగులను అడవిలోకి దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Other Stories:Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్
